
నిజమే... రజనీ ఇంట్రో సీన్ లీక్ అయ్యింది..!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కబాలి లీక్ అయ్యింది. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న చిత్రయూనిట్ ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా రజనీ ఇంట్రడక్షన్కు సంబంధించిన సన్నివేశాన్ని కర్ణాటకకు చెందిన ప్రజా టీవీ ప్రసారం చేసింది. దీంతో లీక్ అయిన విషయం నిజమే అన్న నమ్మకం కలిగింది.
రెండు నిమిషాలకు పైగా ఉన్న పూర్తి సన్నివేశాన్ని ప్రజాటీవీ ప్రసారం చేసింది. ఆ టీవీలో ప్రసారం చేసిన ఈ కథనం యూట్యూబ్లో కూడా పెట్టేయటంతో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ యూట్యూబ్ నుంచి వీడియోను తొలగించినా.. ఇప్పటికే చాలా మంది వీడియోను డౌన్ లోడ్ చేసుకున్నారు.