సిరీస్‌గా సిల్క్‌ జీవితం | Web Series on Silk Smitha by Pa Ranjith | Sakshi
Sakshi News home page

సిరీస్‌గా సిల్క్‌ జీవితం

Published Sat, Aug 18 2018 12:06 AM | Last Updated on Sat, Aug 18 2018 12:06 AM

Web Series on Silk Smitha by Pa Ranjith - Sakshi

సిల్క్‌ స్మిత

1980ల్లో హాట్‌ గాళ్‌గా సౌత్‌ ఇండస్ట్రీలను ఊపు ఊపేసిన స్టార్‌ సిల్క్‌ స్మిత. ఈ పాపులర్‌ స్టార్‌ జీవితం ఆధారంగా ఆల్రెడీ ‘డర్టీ పిక్చర్‌’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాతో విద్యా బాలన్‌ సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఇప్పుడు సిల్క్‌ జీవితం ఆధారంగా వెబ్‌ సిరీస్‌ రూపొందించే ప్లాన్స్‌ జరుగుతున్నాయి. ‘కబాలీ’ ఫేమ్‌ పా.రంజిత్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తారట. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థతో కలసి రంజిత్‌ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్‌ చేయనున్నారు. సిల్క్‌ జీవితంలో బాల్యాన్ని ఎవరూ సరిగ్గా చూపించలేదు. ఈ సిరీస్‌లో సిల్క్‌ బాల్యం నుంచి కథ చెప్పదలిచారట. సిల్క్‌కి ఇండియా వైడ్‌ పాపులారిటీ ఉంది. అందుకే వెబ్‌ సిరీస్‌ ద్వారా అన్ని భాషల వారికి ఈ కథను చూపించదలిచారట. ఇప్పటి వరకూ ఎవ్వరూ చూడని విధంగా రియలిస్టిక్‌గా చూపించాలనే ఆలోచనలో దర్శకుడు రంజిత్‌ ఉన్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement