చాక్లెట్ రజనీతో సెల్ఫీ | Chocolate Rajinikanth for kabali promotion | Sakshi
Sakshi News home page

చాక్లెట్ రజనీతో సెల్ఫీ

Published Tue, Mar 22 2016 1:31 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

చాక్లెట్ రజనీతో సెల్ఫీ

చాక్లెట్ రజనీతో సెల్ఫీ

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్, కబాలీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే తమిళనాట ఎన్నికల జరుగుతుండటంతో ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది. దీంతో తమిళనాట కబాలీ ఫీవర్ తగ్గకుండా ఉండేందుకు చిత్రయూనిట్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఓ రజనీ విగ్రహం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

కబాలీ ప్రమోషన్లో భాగంగా పాండిచ్చేరికి చెందిన ఓ చాక్లెట్ తయారీ కంపెనీ వినూత్న ప్రయోగం చేసింది. తమ సంస్థ నుంచి తయారయ్యే చాక్లెట్తో ఆరడుగుల రజనీ విగ్రహాన్ని కబాలీ గెటప్లో తయారు చేయించి ప్రదర్శనకు ఉంచారు. ఈ విగ్రహాన్ని తమ సంస్థ నిర్వహిస్తున్న అన్ని రెస్టారెంట్లలోనూ ప్రదర్శనకు ఉంచటమే కాకుండా, ఆ విగ్రహంతో సెల్పీ దిగే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

చాలా కాలం తరువాత రజనీ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా తమిళ హీరోయిన్ ధన్సిక లేడీ డాన్గా అలరించనుంది. బ్యాంక్, హాంకాంగ్లలో భారీగా తెరకెక్కిన ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement