రికార్డుల మోత మోగిస్తున్నాడు | Rajinikanth Kabali teaser gets more than 2 Crore views on Youtube | Sakshi
Sakshi News home page

రికార్డుల మోత మోగిస్తున్నాడు

Published Sun, May 29 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

రికార్డుల మోత మోగిస్తున్నాడు

రికార్డుల మోత మోగిస్తున్నాడు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆన్లైన్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రజనీ లేటెస్ట్ సినిమా కబాలి టీజర్.. ఊహకందని లెక్కలతో బాలీవుడ్ తారలకు కూడా చుక్కలు చూపిస్తోంది. యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన టీజర్గా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది కబాలి. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్తో ఇండియాలోనే అతి ఎక్కువ మంది వీక్షించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది.

ఇక లైక్స్ విషయంలో అయితే అంతర్జాతీయ సినిమాలతో పోటి పడుతోంది కబాలి. 4 లక్షలకు పైగా లైక్స్ సాధించిన కబాలి టీజర్, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమా ఏవెంజర్స్ 5.12 లక్షల లైక్స్తో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా జూన్ 9ల కబాలి తొలి థియట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. టీజర్తోనే సంచలనాలు నమోదు చేసిన కబాలి.., ట్రైలర్తో ఇంకెన్ని రికార్డ్లు సృష్టిస్తాడో చూడాలి.

రజనీకాంత్ వయసుమల్లిన డాన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడిగా రాధికా ఆప్టే నటిస్తుంది. యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత కలైపులి యస్ థాను భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement