పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రం తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. నటి పార్వతి, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ చిత్రంపై నటి మాళవిక మోహన్ చాలా ఆశలు పెట్టుకుంది. కాగా తంగలాన్ చిత్రం అప్‌డేట్‌ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు.
ఆయన తన ట్విట్టర్‌లో తంగలాన్ సంభవం చిత్ర టీజర్ అతి త్వరలో అని పేర్కొన్నారు. ఇది విక్రమ్ అభిమానులకు తీపి వార్తే అవుతుంది. కాగా తంగలాన్ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దిగడానికి నిర్మాత సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా నటుడు విక్రమ్ నటించిన మరో చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నటి రీతూ వర్మ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment