రజనీ సినిమా టీజర్‌కు డేట్‌ ఫిక్స్‌ | Rajinikanth Kaala Teaser Date Fixed | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 24 2018 10:58 AM | Last Updated on Sat, Feb 24 2018 1:13 PM

Rajinikanth in Kaala - Sakshi

‘కాలా’ సినిమాలోరజనీకాంత్‌

రజనీకాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాలా’. 2.ఓ రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఏప్రిల్‌ 27న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమాను హీరో ధనుష్‌ నిర్మిస్తున్నారు.

రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. మార్చి 1న కాలా టీజర్‌ ను రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ విలన్‌ గా నటిస్తున్న ఈ సినిమా హుమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారయణ్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement