‘రజనీ బతిమాలితేనే ఒప్పుకున్నా’ | Bollywood Star Nana patekar Says about kaala | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 11 2018 2:47 PM | Last Updated on Sun, Feb 11 2018 2:47 PM

Nana Patekar - Sakshi

బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌

సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించటంపై స్పందించిన నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు తమిళ సినిమా చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదన్న నానా పటేకర్‌, రజనీ కోరినందువల్లే కాలా సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. ప్రస్తుతం నిర‍్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement