కబాలి డైరెక్టర్తో సూర్య సినిమా లేనట్టేనా..?
ఇటీవల కాలంలో భారీ హైప్ క్రియేట్ చేసిన సౌత్ సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దర్శకుడు పా రంజిత్కు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అందుకే కబాలి రిలీజ్కు ముందే స్టార్ హీరోల నుంచి రంజిత్కు అవకాశాలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో సూర్య అయితే తన నెక్ట్స్ సినిమా రంజిత్తోనే అని ప్రకటించేశాడు.
అయితే కబాలి రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్న సూర్య, రంజిత్ల సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా కబాలి రిలీజ్ తరువాత సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో సీన్ రివర్స్ అయ్యింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన కబాలి, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టినా.. డిస్ట్రీబ్యూటర్లు మాత్రం నష్టపోయారన్న టాక్ వినిపించింది. దీంతో సూర్య కూడా రంజిత్తో చేయబోయే సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడట. ప్రస్తుతానికి రంజిత్తో చేయాలనుకున్న సినిమాను పక్కకు పెట్టే ఆలోచనలో ఉన్నాడు సూర్య.