
పెరంబూరు: దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టులో చుక్కెదురైంది. నటుడు కార్తీ హీరోగా మెడ్రాస్, రజనీకాంత్ హీరోగా కబాలి, కాలా వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు పా.రంజిత్. ఈయన ఇటీవల తిరుప్పనందళ్ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొని రాజరాజ చోళన్‌ను కించపరచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మధురై హైకోర్టు శాఖలో పా.రంజిత్‌పై పిటిషన్ దాఖలు కావడంతో ఆయన మందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకున్నారు.
దీంతో కోర్టు పా.రంజిత్‌ను ఈ నెల 21వ తేదీ వరకూ అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారంతో ఆ గడువు పూర్తి కావడంతో పా.రంజిత్ మందస్తు బెయిల్ కోసం మరోసారి శుక్రవారం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీనిపై విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు పా.రంజిత్‌ను అరెస్ట్‌చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment