కబాలి ప్రమోషన్కు రజనీ రాడా..? | Rajinikanth To Miss All Kabali Promotions? | Sakshi
Sakshi News home page

కబాలి ప్రమోషన్కు రజనీ రాడా..?

Jul 15 2016 7:55 PM | Updated on Sep 4 2017 4:56 AM

కబాలి ప్రమోషన్కు రజనీ రాడా..?

కబాలి ప్రమోషన్కు రజనీ రాడా..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా నడుస్తోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో జోరు చూపిస్తున్నారు. పలు అంతర్జాతీయ...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా నడుస్తోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో జోరు చూపిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఉత్పత్తులతో కలిసి సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు, టెలికాం ఆఫర్లు, కబాలి టీషర్ట్లు, కీచైన్లు ఇలా సినీ ప్రచార తీరును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఇంత హడావిడి జరుగుతుంటే ఆ చిత్ర హీరో రజనీకాంత్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. కబాలి షూటింగ్ తరువాత విదేశాలకు వెళ్లిన రజనీ దాదాపు 40 రోజులుగా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. రజనీ ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు వినిపిస్తున్నా, ఆయన సన్నిహితులు ఆ వార్తలను ఖండిస్తున్నారు. మరి అంతా బాగానే ఉంటే రజనీ ప్రచార కార్యక్రమాలకు ఎందుకు రావటం లేదు.

కబాలి సినిమాపై ఇప్పటికే 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తే తప్ప సినిమా హిట్ రేంజ్కు చేరదు. మరి రజనీ రాకుండా అంతటి వసూళ్లు సాధ్యమవుతాయా..? ఈ నెల 20న రజనీ చెన్నై వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత సినిమా రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రజనీ చేసే ప్రచారం సినిమాకు సరిపోతుందా..?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ తలైవా అభిమానులను కలవరపెడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement