సూర్య సినిమా టైటిల్ '5.35'..?
తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది నటుడు సూర్య. ఇటీవల వరుస ప్రయోగాలతో కాస్త స్లో అయిన సూర్య, 24 సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ మాసాలా ఎంటర్టైనర్ సింగం సీరీస్లో ఎస్ 3 సినిమా చేస్తున్న ఈ గజిని స్టార్ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సూర్య. అయితే కబాలి విషయంలో డివైడ్ టాక్ రావటంతో సూర్య సినిమా పట్టాలెక్కుతుందా..? లేదా.? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
మరోసారి ప్రయోగానికే రెడీ అయిన సూర్య ఈ సినిమాకు 5.35 అనే డిఫరెంట్ టైటిల్ను ఫైనల్ చేశాడట. ఇటీవల 24తో సక్సెస్ కొట్టిన ఈ కోలీవుడ్ స్టార్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, సెప్టెంబర్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న వార్త కోలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది.