
తమిళసినిమా: చియాన్ విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్‌లో భారీ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రం విక్రమ్‌కు 61వ సినిమా కానుంది. దీనిని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా, నీలం ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఇది స్టూడియో గ్రీన్ సంస్థ 22వ చిత్రం.
ఇంకా టైటిల్ నిర్ణయించని దీనికి కథ, కథనాన్ని తమిళ్ ప్రభ అందించారు. జి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, కిషోర్‌కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో నటుడు శివకుమార్, ఆర్య, నిర్మాత టి.శివ, ఎస్.ఆర్.ప్రభు, అభినేష్ ఇళంగోవన్, సంతోష్ పి.జయకుమార్, సీవీ కుమార్ హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ తొలి భాగం సెప్టెంబర్ 30న తెరపైకి రానుంది.
చదవండి: Aaditi Pohankar: ఒకప్పుడు రాష్ట్రస్థాయి అథ్లెట్.. ఇప్పుడు స్టార్ నటి..
Comments
Please login to add a commentAdd a comment