సినిమా విజయాలతో సంబంధం లేని తిరుగులేని స్టార్‌డమ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతం. రజనీ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. రజనీపై ఉండే అభిమానం... సినిమా సక్సెస్‌పై ఆధారపడదు. సూపర్‌స్టార్‌కు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుసగా సినిమాలు నిరాశపరుస్తున్న అభిమానులు మాత్రం తలైవా సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు.
కబాలి ఫేం పా.రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రజనీ తాజా చిత్రం ‘కాలా’.. ఈపాటికే సినిమా విడుదలై సంచనాలు సృష్టించాల్సింది. కానీ తమిళ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆలస్యమైంది. లేటుగా వచ్చినా లేటేస్ట్‌గా వస్తా అనే డైలాగ్ ఎలాగూ రజనీకి ఉంది. కాలా సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటును పలికాయని తెలుస్తోంది. తలైవాకు ఉన్న క్రేజ్‌కు ఎంతైనా పెట్టొచ్చు అంటున్నారు అభిమానులు.
ప్రముఖ హీరో, రజనీ అల్లుడైన ధనుష్ ఈ చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ధనుష్ ట్వీటర్ ద్వారా తెలియపరిచారు. మే 9న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నట్లు, రేపు (మే 1) సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు నటించారు. ఈ సినిమాకు కబాలి ఫేం సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
A surprise to Superstar fans. #kaala 1st single #semmaweightu will be released tom evening at 7 pm. #rajinism #thalaivar @Music_Santhosh @beemji @vinod_offl @humasqureshi pic.twitter.com/mLDt1oCfm2
— Dhanush (@dhanushkraja) 30 April 2018
Wunderbar films presents, Superstar’s #kaalaa audio will release on #may9th ... get ready to celebrate thalaivars swag with Santosh narayanan’s stylish music. pic.twitter.com/FbrRwFmtng
— Dhanush (@dhanushkraja) 28 April 2018
Comments
Please login to add a commentAdd a comment