
నటుడు విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందబోతున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ నటించిన కోబ్రా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న భారీ చిత్రంలో విక్రమ్ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా పా.రంజిత్ ప్రస్తుతం ‘‘నక్షత్రం నగర్గిరదు’’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తి కాగానే విక్రమ్ హీరోగా నటించే చిత్రం ప్రారంభం కానుంది. పా.రంజిత్ ఇంతకుముందు ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సార్పట్టా పరంపరై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విక్రమ్ హీరోగా రూపొందించనున్న చిత్రం కూడా పూర్తిగా క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. దీనికి మైదానం అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment