sports based film
-
సార్పట్టా డైరెక్టర్‌తో విక్రమ్ సినిమా.. స్టోరీ లైన్ అదే
నటుడు విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందబోతున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ నటించిన కోబ్రా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న భారీ చిత్రంలో విక్రమ్ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా పా.రంజిత్ ప్రస్తుతం ‘‘నక్షత్రం నగర్గిరదు’’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే విక్రమ్ హీరోగా నటించే చిత్రం ప్రారంభం కానుంది. పా.రంజిత్ ఇంతకుముందు ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సార్పట్టా పరంపరై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విక్రమ్ హీరోగా రూపొందించనున్న చిత్రం కూడా పూర్తిగా క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. దీనికి మైదానం అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. -
హాకీ ఎక్స్‌ప్రెస్
నిన్న కాక మొన్న విడుదలైన సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘నినువీడని నీడను నేను’తో మంచి సక్సెస్ సాధించారు. ఈ నెల 15న ‘తెనాలి రామకృష్ణ’ అంటూ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ని ప్రారంభించి మంచి స్పీడు మీదున్నారు ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాకీ ఆట ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సందీప్ కిషన్ తొలిసారిగా నటిస్తున్నారు. సోమవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సందీప్, మురళీశర్మ, రఘుబాబులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కెవిన్రాజు, ఎడిటింగ్: ఛోటా.కె. ప్రసాద్ -
'గుడ్‌లక్ సఖి' అంటున్న కీర్తి సురేశ్
మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. మన్మధుడు 2 లో అతిథి పాత్రలో మెరిసినా కేవలం రెండు సీన్లకే పరిమితమయ్యారు. ప్రముఖ దర్శకుడు కుకునూర్ నగేశ్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్డ్రాఫ్ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి 'గుడ్ లక్ సఖి' అనే పేరును ఖరారు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన యువతి 10 మీటర్ల షూటింగ్ రైఫిల్‌లో తన ప్రతిభతో ఎలా వెలుగొందింది అన్న ఇతివృత్తంతో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ రోల్లో కీర్తి సురేశ్ నటిస్తుండగా, జగపతిబాబు కోచ్‌గా కనిపించనున్నాడు. ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో మెరవనున్నాడు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'తను వెడ్స్ మను' ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం మేర షూటింగ్ జరుపుకుంది. సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్‌ను నవంబర్ 1నుంచి మొదలుపెట్టనున్నట్లు చిత్రబృందం తెలిపింది. -
గురుదక్షిణ ఏమడిగారు?
ద్రోణాచార్యులనే గురువుగా భావించి ఆయన బొమ్మ ముందు విద్యను నేర్చుకున్న ఏకలవ్యుడి వద్ద బొటన వేలునే గురుదక్షిణగా స్వీకరించారు ద్రోణాచార్యులు. ప్రస్తుత కాలంలో ద్రోణాచార్యులు లాంటి గురువు ఎలాంటి గురుదక్షిణ అడిగి ఉంటారు? అనే కాన్సెప్ట్‌తో సందీప్ కిషన్ లేటెస్ట్ చిత్రం తెరకెక్కనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ‘కార్తికేయ’ను నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్ నిర్మాత. షూటింగ్ వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్రబృందం పేర్కొంది. -
స్పోర్ట్స్ సినిమాలో చేస్తానంటున్న హీరోయిన్
పీవీ సింధు ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో రజత పతకం సాధించడంతో క్రీడల ఫీవర్ అన్ని రంగాలకూ పాకుతోంది. ప్రస్తుతం అకిరా సినిమాతో మంచి బిజీగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. తాను కూడా క్రీడల ఆధారిత సినిమాలో చేస్తానని చెబుతోంది. స్కూల్లోను, కాలేజిలోను చదువుకునే రోజుల్లో తాను క్రీడల్లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్నని, అప్పట్లో తాను వాలీబాల్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్, షాట్‌పుట్, డిస్కస్ త్రో.. ఇలాంటి ఆటలన్నీ ఆడేదాన్ననని తెలిపింది. తనకు గానీ అవకాశం దొరికితే తప్పనిసరిగా క్రీడల సినిమా చేస్తానని చెప్పింది. వాస్తవానికి ఇప్పటికీ తనకు బాగా ఆడాలనే అనిపిస్తోందని.. సమయం దొరికితే టెన్నిస్ లేదా వాలీబాల్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని అంటోంది. తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మౌన గురు రీమేక్‌గా వస్తున్న అకీరాలో సోనాక్షి లీడ్‌రోల్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. దీంతోపాటు నూర్, ఫోర్స్ 2 సినిమాలలోనూ సోనాక్షి నటిస్తోంది.