స్పోర్ట్స్ సినిమాలో చేస్తానంటున్న హీరోయిన్ | Sonakshi Sinha keen to act in sports-based film | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ సినిమాలో చేస్తానంటున్న హీరోయిన్

Published Sat, Aug 20 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

స్పోర్ట్స్ సినిమాలో చేస్తానంటున్న హీరోయిన్

స్పోర్ట్స్ సినిమాలో చేస్తానంటున్న హీరోయిన్

పీవీ సింధు ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో రజత పతకం సాధించడంతో క్రీడల ఫీవర్ అన్ని రంగాలకూ పాకుతోంది. ప్రస్తుతం అకిరా సినిమాతో మంచి బిజీగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. తాను కూడా క్రీడల ఆధారిత సినిమాలో చేస్తానని చెబుతోంది. స్కూల్లోను, కాలేజిలోను చదువుకునే రోజుల్లో తాను క్రీడల్లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్నని, అప్పట్లో తాను వాలీబాల్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్, షాట్‌పుట్, డిస్కస్ త్రో.. ఇలాంటి ఆటలన్నీ ఆడేదాన్ననని తెలిపింది.

తనకు గానీ అవకాశం దొరికితే తప్పనిసరిగా క్రీడల సినిమా చేస్తానని చెప్పింది. వాస్తవానికి ఇప్పటికీ తనకు బాగా ఆడాలనే అనిపిస్తోందని.. సమయం దొరికితే టెన్నిస్ లేదా వాలీబాల్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని అంటోంది. తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మౌన గురు రీమేక్‌గా వస్తున్న అకీరాలో సోనాక్షి లీడ్‌రోల్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. దీంతోపాటు నూర్, ఫోర్స్ 2 సినిమాలలోనూ సోనాక్షి నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement