
సందీప్ కిషన్
ద్రోణాచార్యులనే గురువుగా భావించి ఆయన బొమ్మ ముందు విద్యను నేర్చుకున్న ఏకలవ్యుడి వద్ద బొటన వేలునే గురుదక్షిణగా స్వీకరించారు ద్రోణాచార్యులు. ప్రస్తుత కాలంలో ద్రోణాచార్యులు లాంటి గురువు ఎలాంటి గురుదక్షిణ అడిగి ఉంటారు? అనే కాన్సెప్ట్‌తో సందీప్ కిషన్ లేటెస్ట్ చిత్రం తెరకెక్కనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ‘కార్తికేయ’ను నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్ నిర్మాత. షూటింగ్ వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment