నటి అత్యాచార వీడియో లీక్‌ | Spanish Big Brother Contestant Molestation Video Leaked | Sakshi
Sakshi News home page

నటి అత్యాచార వీడియో లీక్‌

Dec 2 2019 12:11 PM | Updated on Dec 2 2019 5:45 PM

Spanish Big Brother Contestant Molestation Video Leaked - Sakshi

నిందితుడు మారియా లోపెజ్‌, బాధితురాలు కార్లోటా ప్రాడో

స్పెయిన్‌: ప్రఖ్యాత నటి అత్యాచార వీడియో లీకైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారం జరిగిన రెండేళ్ల తర్వాత వీడియో లీకవడం గమనార్హం. వివరాలు.. బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బ్రదర్‌  ఆధారంగా స్పెయిన్‌లో ‘గ్రాన్‌ హెర్మానో’ షో ప్రసారమవుతోంది. 2017లోని సీజన్‌లో స్పానిష్‌ నటి కార్లోటా ప్రాడో పాల్గొంది. ఆ హౌస్‌లోకి ఆమె ప్రియుడు జోస్‌ మారియా లోపెజ్‌ కూడా వచ్చాడు. వీరిద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా ఓ నాడు ఇంటి సభ్యులంతా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అందరూ మద్యం సేవించి మత్తులో ఎక్కడి వారక్కడే స్పృహ లేకుండా పడిపోయారు. ఈ క్రమంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది.

దీంతో షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా మారియా లోపెజ్‌ను షో నుంచి పంపించేశారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లోటాను ఓ గదిలోకి పిలిపించి కెమెరాల్లో రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసి స్థానువైపోయిన కార్లోటా.. ఆపండి.. ప్లీజ్‌.. నావల్ల కాదు, దయచేసి ఆపేయండి అంటూ చేతులెత్తి వేడుకుంది. రోదిస్తున్న హృదయంతో, కన్నీళ్లతో అర్తించింది. అయినా సరే, షో నిర్వాహకులు ఆ రాత్రి తనపై అత్యాచారం జరిగిన పుటేజీలను ఆమెకు చూపించారు. షో యాజమాన్యం బాధితురాలి అత్యాచార వీడియోను టెలికాస్ట్‌ చేయలేదు కానీ బయటకు లీకవకుండా కాపాడలేకపోయింది. పైగా వీటిని కొన్ని కంపెనీలు ప్రచారం కోసం యాడ్స్‌లో వాడుకోవడం సిగ్గుచేటు. దీనిపై అక్కడి ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుడిని శిక్షించాలని.. అంతేకాక నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారితీసిందంటూ షోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement