Spanish Lady
-
నటి అత్యాచార వీడియో లీక్
స్పెయిన్: ప్రఖ్యాత నటి అత్యాచార వీడియో లీకైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారం జరిగిన రెండేళ్ల తర్వాత వీడియో లీకవడం గమనార్హం. వివరాలు.. బిగ్గెస్ట్ టీవీ రియాలిటీ షో బిగ్‌బ్రదర్ ఆధారంగా స్పెయిన్‌లో ‘గ్రాన్ హెర్మానో’ షో ప్రసారమవుతోంది. 2017లోని సీజన్లో స్పానిష్ నటి కార్లోటా ప్రాడో పాల్గొంది. ఆ హౌస్‌లోకి ఆమె ప్రియుడు జోస్ మారియా లోపెజ్ కూడా వచ్చాడు. వీరిద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా ఓ నాడు ఇంటి సభ్యులంతా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అందరూ మద్యం సేవించి మత్తులో ఎక్కడి వారక్కడే స్పృహ లేకుండా పడిపోయారు. ఈ క్రమంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీంతో షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా మారియా లోపెజ్‌ను షో నుంచి పంపించేశారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లోటాను ఓ గదిలోకి పిలిపించి కెమెరాల్లో రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసి స్థానువైపోయిన కార్లోటా.. ఆపండి.. ప్లీజ్.. నావల్ల కాదు, దయచేసి ఆపేయండి అంటూ చేతులెత్తి వేడుకుంది. రోదిస్తున్న హృదయంతో, కన్నీళ్లతో అర్తించింది. అయినా సరే, షో నిర్వాహకులు ఆ రాత్రి తనపై అత్యాచారం జరిగిన పుటేజీలను ఆమెకు చూపించారు. షో యాజమాన్యం బాధితురాలి అత్యాచార వీడియోను టెలికాస్ట్ చేయలేదు కానీ బయటకు లీకవకుండా కాపాడలేకపోయింది. పైగా వీటిని కొన్ని కంపెనీలు ప్రచారం కోసం యాడ్స్‌లో వాడుకోవడం సిగ్గుచేటు. దీనిపై అక్కడి ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుడిని శిక్షించాలని.. అంతేకాక నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారితీసిందంటూ షోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. -
పార్టీ పేరిట పిలిచి.. స్పానిష్ యువతిపై..
గురుగ్రామ్: ఢిల్లీకి చెందిన ఫిల్మ్ మేకర్ తనపై అత్యాచారం జరిపాడని 23 ఏళ్ల స్పానిష్ యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ విద్యార్థి అయిన స్పానిష్ యువతి భారత్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఏడాది పాటు ఇంటెర్న్‌గా పనిచేయడానికి ఇక్కడికి వచ్చింది. గురుగ్రామ్‌లో బస చేసిన ఆమె.. ఇల్లు మారాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఫేస్బుక్ గ్రూప్ ద్వారా నిందితుడు ఆంజనేయ్ ఆమెకు పరిచయమయ్యాడు. యానిమేషన్ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్న అతని స్వస్థలం ఢిల్లీలోని ఆనంద్ విహార్ కాగా.. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉంటున్నాడు. అతను శుక్రవారం (జూన్ 14) పార్టీ ఉందని తన ఇంటికి పిలిచాడు. దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో స్పానిష్ యువతి అతనికి ఇంటికి వెళ్లింది. ‘నేను అతన్ని గట్టిగా నమ్మడంతోనే అతని ఇంటికి వెళ్లాను. కొన్ని గంటలు కలిసి గడిపాక మేం ముద్దులు పెట్టుకున్నాం. ఆ తర్వాత పైన ఉన్న గదిలోకి నన్ను అతను తీసుకెళ్లాడు. అయితే, శృంగారంలో పాల్గొనాలన్న ఆలోచన నన్ను ఇబ్బంది పెట్టింది. అది వద్దని నేను అతనికి చెప్పను. దీంతో కనీసం రాత్రి ఇక్కడే గడిపి వెళ్లు అతని చెప్పాడు. ఇందుకు అంగీకరించాను. కానీ, నిద్రపోయిన తర్వాత కొంతసేపటికి మేలుకువ వచ్చింది. ఆంజనేయ్ హస్తప్రయోగం చేసుకుంటూ నావైపు చూస్తూ కనిపించాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ అతను నన్ను వెళ్లనివ్వలేదు. నాకు ఇబ్బందిగా ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతన్ను బలవంతపెట్టాడు. బలత్కారం చేశాడు. అతను చెప్పినట్టు చేయకుంటే ఇంకేదైనా దారుణం చేస్తాడేమోనన్న భయంతో ఈ ఘోరాన్ని నేను భరించాను. డోర్లు మూసి..నా ఫోన్ విసిరేసి..అతను నాపై అత్యాచారం చేశాడు’ అని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. తన స్నేహితురాలి ద్వారా ఆ ఘటన జరిగిన మరునాడే బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొదట ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితురాలు అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆంజనేయ్పై ఐపీసీ సెక్షన్లు 376 (రేప్), 342 (అక్రమ నిర్బంధం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. -
చూడాలని ఉంది..
నుదిటిన కుంకుమతో మెరిసిపోతున్న ఈమె స్పానిష్ లేడీ! పేరు.. పరస్కెవ్ కఫ్కా. బార్సిలోనా నివాసి. మెట్రోపొలిస్ అసోసియేషన్‌లో పనిచేస్తుంది. లెవన్త్ మెట్రోపొలిస్ సదస్సుకు స్పెయిన్ డెలిగేట్‌గా హాజరైన ఆమెతో తారామతి బారాదరిలో జరిపిన చిట్‌చాట్ ఇది.. నేను హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి. ఆ మాటకొస్తే ఇండియాకు ఇదే తొలిసారి రావడం. ఇక్కడ ల్యాండ్ అయి 24 గంటలే అయింది. అందుకే హైదరాబాద్‌ని పూర్తిగా స్టడీ చేయలేదు. ఈ టైంలో నేను చూసింది.. శంషాబాద్ నుంచి హైటెక్స్ నోవాటెల్ హోటల్.. అక్కడి నుంచి తారామతి బారాదరి వరకు మాత్రమే! ఆ చిన్న పరిశీలనలో హైదరాబాద్ నాకు చాలా వేడిగా.. రద్దీగా అనిపించింది. అండ్ అఫ్కోర్స్ వెరీ బ్యూటిఫుల్! నేను పుట్టిపెరిగింది అంతా బార్సిలోనా (స్పెయిన్)లోనే. నా సిటీకి హైదరాబాద్‌కి చాలా తేడా ఉంది. హైదరాబాదీలకు మంచి హాస్పిటాలిటీ ఉంది. చాలా ఓపెన్ మైండెడ్ పీపుల్. ఓ సిమిలారిటీ కూడా ఉంది.. ఆర్ట్‌కి సంబంధించి. యూరోప్‌లో కూడా లోకల్ ఆర్ట్‌కి ఆదరణ ఎక్కువ ఇక్కడిలాగే. షాపింగ్‌కు వెళ్తా.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇండియాలోని తాజ్‌మహల్, చార్మినార్‌ల గురించి వింటున్నాను. తాజ్‌మహల్ సంగతేమో కాని ఇన్నాళ్లకు చార్మినార్ చూసే అవకాశం వచ్చింది. ఐయామ్ ఈగర్ టు సీ చార్మినార్ అండ్ ఫలక్‌నుమా ప్యాలెస్. నిజానికి ఒక్కదాన్ని వెళ్లి హైదరాబాద్ అంతా చుట్టిరావాలని ఉంది. సెక్యూరిటీపరంగా అసలు మమ్మల్ని ఒంటరిగా ఎక్కడికీ వెళ్లనివ్వట్లేదు. ఆ మాటకొస్తే హోటల్ నుంచి కదలనివ్వడంలేదు. ఇక్కడి చీర.. సల్వార్ సూట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్‌తో షాపింగ్‌కు ప్లాన్ చేస్తున్నాను. ఈ సదస్సులో.. మెట్రోపొలిస్.. అతి పెద్ద గ్లోబల్ అసోసియేషన్. సిటీస్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్‌కి సంబంధించిన ఐడియాలను, అనుభవాలను షేర్ చేస్తుంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే సమన్వయకర్తలుగా పనిచేస్తామన్నమాట.