చూడాలని ఉంది.. | There is going to | Sakshi
Sakshi News home page

చూడాలని ఉంది..

Published Wed, Oct 8 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

చూడాలని    ఉంది..

చూడాలని ఉంది..

నుదిటిన కుంకుమతో మెరిసిపోతున్న ఈమె స్పానిష్ లేడీ! పేరు.. పరస్కెవ్ కఫ్కా. బార్సిలోనా నివాసి.  మెట్రోపొలిస్ అసోసియేషన్‌లో పనిచేస్తుంది.  లెవన్త్ మెట్రోపొలిస్ సదస్సుకు స్పెయిన్ డెలిగేట్‌గా హాజరైన ఆమెతో తారామతి బారాదరిలో జరిపిన చిట్‌చాట్ ఇది..
 
 నేను హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి. ఆ మాటకొస్తే ఇండియాకు ఇదే తొలిసారి రావడం. ఇక్కడ ల్యాండ్ అయి 24 గంటలే అయింది. అందుకే హైదరాబాద్‌ని పూర్తిగా స్టడీ చేయలేదు. ఈ టైంలో నేను చూసింది.. శంషాబాద్ నుంచి హైటెక్స్ నోవాటెల్ హోటల్.. అక్కడి నుంచి తారామతి బారాదరి వరకు మాత్రమే! ఆ చిన్న పరిశీలనలో హైదరాబాద్ నాకు చాలా వేడిగా.. రద్దీగా అనిపించింది. అండ్ అఫ్‌కోర్స్ వెరీ బ్యూటిఫుల్! నేను పుట్టిపెరిగింది అంతా బార్సిలోనా (స్పెయిన్)లోనే. నా సిటీకి  హైదరాబాద్‌కి చాలా తేడా ఉంది. హైదరాబాదీలకు మంచి హాస్పిటాలిటీ ఉంది. చాలా ఓపెన్ మైండెడ్ పీపుల్. ఓ సిమిలారిటీ కూడా ఉంది.. ఆర్ట్‌కి సంబంధించి. యూరోప్‌లో కూడా లోకల్ ఆర్ట్‌కి ఆదరణ ఎక్కువ ఇక్కడిలాగే.

షాపింగ్‌కు వెళ్తా..

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇండియాలోని తాజ్‌మహల్, చార్మినార్‌ల గురించి వింటున్నాను. తాజ్‌మహల్ సంగతేమో కాని ఇన్నాళ్లకు చార్మినార్ చూసే అవకాశం వచ్చింది. ఐయామ్ ఈగర్ టు సీ చార్మినార్ అండ్ ఫలక్‌నుమా ప్యాలెస్. నిజానికి ఒక్కదాన్ని వెళ్లి హైదరాబాద్ అంతా చుట్టిరావాలని ఉంది. సెక్యూరిటీపరంగా అసలు మమ్మల్ని ఒంటరిగా ఎక్కడికీ వెళ్లనివ్వట్లేదు. ఆ మాటకొస్తే హోటల్ నుంచి కదలనివ్వడంలేదు. ఇక్కడి చీర.. సల్వార్ సూట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్‌తో షాపింగ్‌కు ప్లాన్ చేస్తున్నాను.
 
ఈ సదస్సులో..

మెట్రోపొలిస్.. అతి పెద్ద గ్లోబల్ అసోసియేషన్. సిటీస్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్‌కి సంబంధించిన ఐడియాలను, అనుభవాలను షేర్ చేస్తుంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే సమన్వయకర్తలుగా  పనిచేస్తామన్నమాట.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement