లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? | Why leaked videos is titled as Radhika Apte sex scene | Sakshi
Sakshi News home page

లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?

Published Wed, Aug 17 2016 9:26 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?

లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?

బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే తాజా సినిమా 'పర్చెడ్‌' సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. ఈ లీక్ విషయంలో 'కబాలి' హీరోయిన్‌ రాధికకు సహ నటుడు ఆదిల్‌ హుస్సేన్ అండగా నిలిచారు. 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' పేరిట దృశ్యాలను ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దృశ్యాలను ఎందుకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్‌ సీన్' అని పేర్కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ దృశ్యంలో తామిద్దరం నటించినా.. రాధికను కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కొన్నిరోజుల కిందట ఇంటర్నెట్‌లో లీకైన ఈ ఘాటైన దృశ్యాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలను ఎవరూ లీక్ చేశారనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'లీకైన వీడియోలకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్‌ సీన్‌' అని అనకుండా 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' అని టైటిల్ పెట్టారు. ఎందుకంటే పురుషుడు శృంగారంలో పాల్గొనడం ఈ దేశంలో పెద్ద విషయం కాదు. కానీ మహిళల విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తారు. మన నివసిస్తున్న పితృసామ్య వ్యవస్థ ఆలోచన ధోరణిని ఇది చాటుతోంది. పాశ్చాత్య దృశ్యాల్లో అలాంటి సీన్లు సినిమాలో ఉండటం మాములు విషయమే' అని పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నా కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన సమాజ వైఖరిని అద్దం పడుతోందని పేర్కొన్నారు.

లీనా యాదవ్ తెరకెక్కించిన 'పర్చెడ్' సినిమా 2015 టొరంటో చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఓ భార్య, ఓ తల్లి, ఓ కూతురు, ఓ వేశ్య.. ఇలా నలుగురు మహిళల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement