Adil Hussain
-
రూ.200 కోట్లు ఇచ్చినా యానిమల్ చేసేవాడిని కాదు: నటుడు
తొలి సినిమా 'అర్జున్ రెడ్డి'తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం దాదాపు రూ.379 కోట్లు కొల్లగొట్టింది. తన మూడో సినిమా యానిమల్ ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.సిగ్గుతో తల దించుకున్నాఅయితే కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు గిల్టీగా ఫీలవుతున్నానని నటుడు అదిల్ హుస్సేన్ ఆ మధ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తన పాత్ర బానే ఉందని, కానీ రిలీజ్ తర్వాత సినిమా చూశాకే సిగ్గుతో తల దించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. దీనికి సందీప్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. 30 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ బ్లాక్‌బస్టర్ మూవీతో వచ్చిందని చురకలంటించాడు.ఆయనకంటే ఫేమసా?తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదిల్.. సందీప్ వ్యాఖ్యలపై స్పందించాడు. 'ఆయనేమైనా తైవాన్ డైరెక్టర్ ఆంగ్ లీ కన్నా ఫేమస్ అనుకుంటున్నాడా? ఆయన అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. కబీర్ సింగ్ కలెక్షన్స్ నాకంతగా తెలీదు కానీ, ఆంగ్ లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై మూవీ దాదాపు 5 వేల కోట్లపైన రాబట్టింది. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేననుకోవడం లేదు. కోట్లు ఇచ్చినా నోఅతడు ఆచితూచి మాట్లాడితే బాగుండేది. ఏదో ఆవేశంలో వాగేశాడు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు' వ్యాఖ్యానించాడు. యానిమల్ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా? అన్న ప్రశ్నకు.. లేదని బదులిచ్చాడు. రూ.100-200 కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయనని అదిల్ తెలిపాడు. కాగా అదిల్ హుస్సేన్.. 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఓ పాత్రలో నటించాడు.చదవండి: పెళ్లయ్యాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. సంతోషం ఎంతోకాలం నిలవలేదు: నమిత -
ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు
కబీర్ సింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్ సింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను. డబ్బులెక్కువ డిమాండ్ చేశా కానీ నేను డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు ఇది చూసిన కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది. మీరు బాధపడక్కర్లేదు మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂 — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024 చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం -
'ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి'
ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'మొదటగా డైరెక్టర్ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్‌కు వెళ్లాము.' అని చెప్పాడు. మెరిల్ స్ట్రీప్‌తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్ శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌తో పోలుస్తూ.. ఆమె 'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. శ్రీదేవి, జాన్వీ కపూర్ల మధ్య పోలికలు శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్ వివరించాడు. జాన్వీ తన తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్ చేయడం చాలా కష్టమైన పని.. కానీ జాన్వీ కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్ ఉంది. కచ్చితంగా భవిష్యత్‌లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్ తెలిపాడు. టాలీవుడ్లో జూ.ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఆస్కార్ ఎంట్రీ!
ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు దాదాపు ఆరు నెలల టైమ్ ఉంది. కానీ ఆ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అప్పుడే మొదలైనట్లు ఉన్నాయి. ‘వాట్ విల్ పీపుల్ సే’ సినిమా 91వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీకి ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఇరామ్ హాక్ దర్శకత్వం వహించారు. ఇందులో మారియా, అదిల్ హుస్సేన్ కీలక పాత్రలు చేశారు. ఆస్కార్ విషయాన్ని హుస్సేన్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘2019 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఆఫీషియల్ ఎంట్రీకి మా సినిమా ఎంపికైంది. మా సినిమా ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో నామినేషన్ దక్కించుకుంటుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు హుస్సేన్. 91వ ఆస్కార్ వేడుకలు 2019 ఫిబ్రవరి 24న జరగుతాయని వార్తలు వస్తున్నాయి. -
భ్రాంతి కాదు నిజం అయారి
‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ (దేశాన్నే అమ్మేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది?) అంటూ దేశమంతా అలుముకున్న అవినీతి మీద ఆలోచనను రేకెత్తించేదే ‘అయారి’ సినిమా! ‘ఎ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ చబ్బీస్’, ‘బేబీ’ తీరులో ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తించలేకపోయినా.. దర్శకుడు నీరజ్ పాండే మార్క్నైతే చూపిస్తుంది. అయారి.. అంటే భ్రాంతి.. తాంత్రికత.. మాంత్రికత! అన్నీ బాగున్నట్టు అనిపించే, ఫీల్ గుడ్ ఫీల్ భ్రాంతిని కలిగించే పరిస్థితుల వెనక ఉన్న అసలు కథను చూపించే సినిమా. ఇది కేవలం కల్పితం. ఎవరినీ, దేనినీ ఉద్దేశించి కాదు అంటూ ప్రారంభంలో డిస్క్లేమర్ వేసినా.. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతిని సెల్యూలాయిడ్ మీద చూపించిన చిత్రం ఇది. అందుకే పైన చెప్పిన మాట అంటాడు ఆర్మీ చీఫ్ ‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ అని! ఆహారధాన్యాల దగ్గర నుంచి ఆయుధాల దాకా అన్ని శాఖల్లో అంతటా అవినీతే. ఎక్కడికక్కడ దేశాన్ని అమ్ముకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? మనకన్నా ముందు తరం.. తర్వాత తరాలకు ఏం స్ఫూర్తిని పంచుతారు? సంపాదన ఆశలో పడి ఈ తరం ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటూ తరాల ఆలోచనల అంతరాలనూ ప్రశ్నిస్తుంది? చర్చకు చోటిస్తుంది. దేశ భక్తి అనే పెద్ద మాటలు వద్దు కాని.. ఆరోగ్యకరమైన వాతావరణమైతే దేశంలో ఉండాలికదా! మన దేశంలో మనం భద్రంగా ఉన్నామనే భావనైతే కలగాలి కదా! దేశానికి కంచెలా ఉన్న రక్షణ శాఖ ఆ నమ్మకాన్నివ్వాలి కదా! అదే అమ్మకానికి తయారైపోతే? విశ్వాసాన్ని కోల్పోతాడు ఓ యంగ్ సోల్జర్, మేజర్ జయ్ బక్షి (సిద్ధార్థ్ మల్హోత్రా). రక్షణ శాఖలోని పెద్ద తలకాయలైతే ఆయుధాలు అమ్మే డీలర్స్‌తో డీల్ కుదుర్చుకొని నిజాయితీగా పనిచేస్తున్న టీమ్‌ను పణంగా పెట్టాలనుకున్నప్పుడే మొత్తం మిలటరీ వ్యవస్థ మీదే గౌరవాన్ని తుడిచేసుకుంటాడు. ఆ డీల్‌లో తానూ వాటా పంచుకోవాలనుకుంటాడు. డ్యూటీని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కల్నల్ అభయ్ సింగ్ (మనోజ్ బాజ్‌పాయ్)ను స్ఫూర్తిగా తీసుకుని.. విధి నిర్వహణలో అతనంతటివాడిని కావాలని కలలు కని ఆర్మీలోకి వస్తాడు. కల్నల్ అభయ్‌సింగ్ నేతృత్వంలోని కోవర్ట్ ఆపరేషన్స్ (స్పెషల్)లో సభ్యుడిగా ఉంటుంటాడు జయ్ భక్షి. ఒకరకంగా కల్నల్‌కు ఏకలవ్య శిష్యుడు జయ్. ఆపరేషన్స్ నిర్వహణలో ఆలోచన దగ్గర్నుంచి, వ్యూహప్రతివ్యూహాలు, ఆచరణ అన్నీ తన గురువులాగే చేస్తుంటాడు. ట్యాపింగ్.. రేటింగ్ ఈ స్పెషల్ టీమ్ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఓ మిలిటరీ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు ఓ డీల్ తీసుకుని రావడం గురించి. ఓ ఆర్మ్స్ డీలర్ తరపున ఓ ఆఫర్ తీసుకొని వస్తాడు ఆ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు. ఆ డీల్‌ను మన్నించి వాళ్ల దగ్గర ఆయుధాలు కొంటే అమరవీరుల వితంతువులకు సంక్షేమ ఫండ్‌నూ ఇస్తారనే తాయిలాన్నీ చూపిస్తాడు. ఆ ఆఫర్‌కు తల వంచని చీఫ్ ‘‘చివరకు దేశాన్నీ అమ్మేస్తున్నామన్న మాట’’ అంటూ చురకా అంటిస్తాడు. ‘‘అనధికారికంగా.. 20 కోట్ల ఫండ్‌తో మీరు నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్ కోవర్ట్ ఆపరేషన్స్ మాటేంటి?’’ అని అప్పటిదాకా రహస్యంగా ఉన్న విషయాన్ని బయటపెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు తలపడ్తాడు ఆ ఆఫీసర్. ఆ స్పెషల్ టీమ్ ఓ కాజ్ కోసం.. ఎవరికీ తెలియకుండా నియమించింది. అది బయటపడేసరికి ఖంగు తింటాడు ఆర్మీ చీఫ్. వాళ్ల సంభాషణను ట్యాప్ చేస్తున్న జయ్ కూడా విస్మయం చెందుతాడు. అయినా తలవంచడు ఆర్మీ చీఫ్. దేశానికి రక్షణగా నిలవాల్సిన ఆ శాఖలోని అవినీతి మొత్తం మిలటరీ మీదే విశ్వాసాన్ని పోగొడ్తుంది జయ్‌కు. ఆ టీమ్‌లోంచి ఈ ఆఫీసర్ టీమ్‌లోకి మారుతాడు జయ్.. డబ్బు సంపాదించుకోవడానికి. అప్పటికే ఈ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం ఓ ఎథికల్ హ్యాకర్ సోనియా (రకుల్‌ప్రీత్ సింగ్)తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్తాడు జయ్. ఇప్పుడు ఈ ఆఫీసర్ టీమ్‌లో చేరి తన కోవర్ట్ టీమ్ రహస్యాలను చెప్పేందుకు పదికోట్లకు డీల్ కుదుర్చుకుని తన ప్రియురాలితో దేశాన్ని వదిలిపోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు కూడా. ఈ విషయం కల్నల్ అభయ్సింగ్కు తెలుస్తుంది. జయ్ కోసం వేట మొదలుపెడ్తాడు. ఇందులో భాగంగానే లండన్ చేరతారు ఇద్దరూ. అప్పటికే సోనియా లండన్ చేరుకుని ఉంటుంది జయ్ ప్లాన్‌లో భాగంగా. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతో అతనికి దొరక్కుండా జాగ్రత్త పడ్తుంటాడు జయ్. ఇంకా పై ఎత్తులు వేసి దగ్గరకు రప్పిస్తాడు కల్నల్. ఇందులో ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ (అదిల్ హుస్సేన్)ను పావులా వాడుకుంటాడు అభయ్. ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ కూడా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆఫీసరే. ఇండియన్ ఆర్మీలో ఉన్న లొసుగులు, విధివిధానాలన్నిటినీ ఔపోసన పట్టిన అతను ఆయుధాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తొచ్చని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వ్యాపారం మొదలుపెడ్తాడు. విదేశీ కంపెనీల ఆయుధాలకు డీలర్‌గా మారి మన దేశంలోని మిలటరీ అధికారులకు లంచాలిస్తూ అసలు ధరకన్నా నాలుగు రెట్ల ధరతో ఆయుధాలను కొనిపిస్తుంటాడు. అలా రిటైరయ్యి, మళ్లీ ఉద్యోగంలో చేరిన ఓ ఆర్మీ ఆఫీసర్‌నూ పట్టి.. ఆయన ద్వారా చీఫ్‌కు తన వర్తమానం పంపిస్తాడు అలా. ఆర్మీ చీఫ్ వద్దనేసరికి జయ్ భక్షి సహాయంతో ఆ చీఫ్ నియమించిన కోవర్ట్ ఆపరేషన్స్ గుట్టు రట్టు చేసి టీఆర్పీలో నంబర్ మూడులో ఉన్న ఓ చానల్ రిపోర్టర్‌కు ఇస్తాడు టెలికాస్ట్ చేయమని. దాంతో చానల్ రేటింగ్‌ను పెంచుకొని నంబర్‌వన్ చానల్‌గా అయిపోమ్మని. మోసం.. దగా అయితే కల్నల్ అభయ్ సింగ్ ఆ పాచిక పారనివ్వడు. జయ్‌ను పట్టుకునే క్రమంలో జయ్ ద్వారా తెలుసుకున్న, అందుకున్న సమాచారంతో ఆ చానల్ రిపోర్టర్‌ను కలుసుకొని ఇంకో రికార్డర్ ఇస్తాడు టెలికాస్ట్ చేసుకొమ్మని. ఆఫీసర్ ఇచ్చినది వేసుకోవాలో.. ఇప్పుడు తాను ఇచ్చింది వేసుకోవాలో విచక్షణ నీదే అంటాడు. అది అమరవీరుల వితంతువుల కోసం ముంబైలో కట్టిన నివాస సముదాయంలో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తాకథనం. ఆ రిపోర్టర్ అభయ్‌సింగ్ ఇచ్చిన కథనాన్నే టెలికాస్ట్ చేయిస్తుంది. ఆ ఆఫీసర్ తుపాకితో పేల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ నిర్మాణం అవినీతిలో ప్రధాన హస్తం ఆ ఆఫీసర్‌దే. ఈ మొత్తం వ్యవహారం... రక్షణ శాఖ పట్ల అభయ్‌సింగ్, జయ్ల మ«ధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి ఆ ఇద్దరినీ ఒక్కటిచేసే దిశగా సాగి సినిమాను ఎండ్ చేస్తుంది. కశ్మీర్ ఓ ప్రదేశం కాదు.. రక్షణ శాఖ, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు, డీలర్లు, దేశీ మీడియా.. ఇవన్నీ కలిసి ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి? ఆ లాబీ ముసుగులో ఎవరి ప్రయోజనాలను వాళ్లు ఎంతెంత నెరవేర్చుకుంటున్నారు? ఈ నేపథ్యంలో దేశ రక్షణ, దానిపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా పణంగా పెడ్తున్నారు? అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతుందీ సినిమా. ‘‘ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల వైపు ఎందరో మేధావులు, విద్యావేత్తలు ఉన్నారు. అయినా కశ్మీర్ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపట్లేదు?’’ అని ప్రశ్నిస్తాడు జయ్.. కల్నల్ అభయ్సింగ్ను. ‘‘కశ్మీర్ ఓ ప్రదేశంకాదు.. ఓ ఇండస్ట్రీ. దానివల్ల వ్యాపారుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరికీ లాభాలున్నాయి. ఓ సమస్య లాభాలను పంచుతున్నంత కాలం దాన్ని కాలం చెల్లనివ్వకుండా చూసుకుంటారు ’’ అంటాడు కల్నల్. ఎంత నిజం? అదే నిజం దేశంలోని అన్ని సమస్యలకు వర్తిస్తుంది. అదే చెప్తుంది.. చూపిస్తుంది ‘అయారి’ సినిమా. పాలకులు, కార్పోరేట్ శక్తులు కలిసి సమస్యలతో ప్రయోజనాలను పిండుకుంటే ప్రజలకు అంతా బాగుందనే భ్రాంతి కలగజేస్తూ జోకొడ్తుంటారు. చైతన్యం కాకపోతే అయారి (భ్రాంతే) మిగుల్తుంది. మనోజ్‌భాజ్‌పాయ్ ఈ సినిమాకు ఊపిరి. ఆదిల్ హెస్సేన్, నసీరుద్దీన్ షా, అనుపమ్ఖేర్ల నటన గురించి ప్రతేక్యంగా చెప్పేదేముంటుంది? పాత్రలను పండిస్తారు. వీళ్లకు సమ ఉజ్జీగా సిద్ధార్థ్ మల్హోత్రా శక్తియుక్తులను కూడదీసుకున్నాడు. రకుల్‌ప్రీత్.. డాన్సింగ్ డాల్‌గా మిగల్లేదు. దర్శకుడు నీరజ్‌పాండే ఇంతకుముందు తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళితే నిరాశపడ్తారు. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అయారి’ అలరిస్తుంది. – శరాది -
సిగ్గు పడటంలేదు!
కళ్లు ఎరుపెక్కాయి.. కోపంతో పెదాలు అదిరాయి.. మాటల్లో కారాలు-మిరియాలు నూరినంత ఘాటు.. ఆగ్రహంతో రగిలిన రాధికా ఆప్టే ముంబైలో ఓ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ‘పార్ష్డ్’ సినిమాలో నుంచి లీకైన నగ్న దృశ్యాల గురించి ప్రశ్నించినందుకు కోపంతో రగిలిపోయారు. ‘‘మై ఫ్రెండ్... సారీ! మీలాంటి వ్యక్తులే ఈ వివాదాలను సృష్టిస్తారు. మీరు ఆ క్లిప్ (లీకైన న్యూడ్ సీన్) చూశారు. ఫ్రెండ్‌కి షేర్ చేశారు. కాంట్రవర్సీకి కారణమయ్యారు’’ అని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్ష్డ్’లో ఆదిల్ హుస్సేన్, రాధికా ఆప్టే నటించిన న్యూడ్ సీన్ ఇండియాలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. న్యూడ్ సీన్లో నటించడం నటనలో ఓ భాగమన్న రాధిక.. ‘‘నేను దేనికీ సిగ్గు పడడం లేదు. నా క్లిప్ చూడడం కంటే అద్దంలో మీరు మీ నగ్నదేహాన్ని చూసుకోండి. ఎవరైతే వాళ్ల దేహాన్ని భరించలేరో వాళ్లే ఇతరుల దేహంపై దృష్టి పెడతారు’’ అన్నారు. -
లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తాజా సినిమా 'పర్చెడ్' సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఈ లీక్ విషయంలో 'కబాలి' హీరోయిన్ రాధికకు సహ నటుడు ఆదిల్ హుస్సేన్ అండగా నిలిచారు. 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' పేరిట దృశ్యాలను ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దృశ్యాలను ఎందుకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్' అని పేర్కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ దృశ్యంలో తామిద్దరం నటించినా.. రాధికను కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్నిరోజుల కిందట ఇంటర్నెట్లో లీకైన ఈ ఘాటైన దృశ్యాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలను ఎవరూ లీక్ చేశారనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'లీకైన వీడియోలకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్' అని అనకుండా 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' అని టైటిల్ పెట్టారు. ఎందుకంటే పురుషుడు శృంగారంలో పాల్గొనడం ఈ దేశంలో పెద్ద విషయం కాదు. కానీ మహిళల విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తారు. మన నివసిస్తున్న పితృసామ్య వ్యవస్థ ఆలోచన ధోరణిని ఇది చాటుతోంది. పాశ్చాత్య దృశ్యాల్లో అలాంటి సీన్లు సినిమాలో ఉండటం మాములు విషయమే' అని పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నా కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన సమాజ వైఖరిని అద్దం పడుతోందని పేర్కొన్నారు. లీనా యాదవ్ తెరకెక్కించిన 'పర్చెడ్' సినిమా 2015 టొరంటో చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఓ భార్య, ఓ తల్లి, ఓ కూతురు, ఓ వేశ్య.. ఇలా నలుగురు మహిళల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది.