రూ.200 కోట్లు ఇచ్చినా యానిమల్‌ చేసేవాడిని కాదు: నటుడు | Adil Hussain Says Even If They Paid Me Rs 100 To 200 Crore, I Would Never Do It | Sakshi
Sakshi News home page

సందీప్‌కు అంత సీన్‌ లేదు.. రూ.200 కోట్లు ఇచ్చినా చేయను: నటుడు

Published Wed, Jun 12 2024 5:44 PM | Last Updated on Wed, Jun 12 2024 7:26 PM

Adil Hussain: Even if They Paid me Rs 100 to 200 crore, I Would Never do it

తొలి సినిమా 'అర్జున్‌ రెడ్డి'తో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది. ఇదే సినిమాను హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేసి బాలీవుడ్‌లోనూ సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఈ చిత్రం దాదాపు రూ.379 కోట్లు కొల్లగొట్టింది. తన మూడో సినిమా యానిమల్‌ ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

సిగ్గుతో తల దించుకున్నా
అయితే కబీర్‌ సింగ్‌ సినిమాలో నటించినందుకు గిల్టీగా ఫీలవుతున్నానని నటుడు అదిల్‌ హుస్సేన్‌ ఆ మధ్య సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశాడు. తన పాత్ర బానే ఉందని, కానీ రిలీజ్‌ తర్వాత సినిమా చూశాకే సిగ్గుతో తల దించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. దీనికి సందీప్‌ రెడ్డి కూడా కౌంటర్‌ ఇచ్చాడు. 30 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీతో వచ్చిందని చురకలంటించాడు.

ఆయనకంటే ఫేమసా?
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదిల్‌.. సందీప్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. 'ఆయనేమైనా తైవాన్‌ డైరెక్టర్‌ ఆంగ్‌ లీ కన్నా ఫేమస్‌ అనుకుంటున్నాడా? ఆయన అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. కబీర్‌ సింగ్‌ కలెక్షన్స్‌ నాకంతగా తెలీదు కానీ, ఆంగ్‌ లీ తెరకెక్కించిన లైఫ్‌ ఆఫ్‌ పై మూవీ దాదాపు 5 వేల కోట్లపైన రాబట్టింది. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేననుకోవడం లేదు. 

కోట్లు ఇచ్చినా నో
అతడు ఆచితూచి మాట్లాడితే బాగుండేది. ఏదో ఆవేశంలో వాగేశాడు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు' వ్యాఖ్యానించాడు. యానిమల్‌ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్‌ చేస్తే చేసేవారా? అన్న ప్రశ్నకు.. లేదని బదులిచ్చాడు. రూ.100-200 కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయనని అదిల్‌ తెలిపాడు. కాగా అదిల్‌ హుస్సేన్‌.. 2012లో వచ్చిన లైఫ్‌ ఆఫ్‌ పై సినిమాలో ఓ పాత్రలో నటించాడు.

చదవండి: పెళ్లయ్యాక ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ.. సంతోషం ఎంతోకాలం నిలవలేదు: నమిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement