అదిల్ హుస్సేన్, మారియా
ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు దాదాపు ఆరు నెలల టైమ్ ఉంది. కానీ ఆ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అప్పుడే మొదలైనట్లు ఉన్నాయి. ‘వాట్ విల్ పీపుల్ సే’ సినిమా 91వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీకి ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఇరామ్ హాక్ దర్శకత్వం వహించారు. ఇందులో మారియా, అదిల్ హుస్సేన్ కీలక పాత్రలు చేశారు. ఆస్కార్ విషయాన్ని హుస్సేన్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘2019 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఆఫీషియల్ ఎంట్రీకి మా సినిమా ఎంపికైంది. మా సినిమా ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో నామినేషన్ దక్కించుకుంటుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు హుస్సేన్. 91వ ఆస్కార్ వేడుకలు 2019 ఫిబ్రవరి 24న జరగుతాయని వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment