
సాక్షి, అమరావతి : రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టారని తెలిపారు. ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ నియమాకాలపై సీఎం వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేశారని వెల్లడించారు.
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు జర్నలిజం విలువలు తెలియవని విమర్శించారు. ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తు పబ్బం గడుపుతున్నారని.. సీఎం వైఎస్ జగన్ పాలనపై విషం చిమ్మే ధోరణిలో రాధాకృష్ణ వెళ్తున్నారని మండిపడ్డారు. గ్రామ సచివాలయం పరీక్ష పేపర్ లీకైందని అసత్య ప్రచారం చేశారు.. అలాగే అధికారుల బదిలీలపై కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని తెలిపారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ఆధారాలతో రాయాలని.. కుట్రలతో కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment