
ఆంధ్రజ్యోతి ఎండీపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై నిరాధారమైన వార్తలు ప్రచురిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సీఎం కేసీఆర్‌పై దుష్ర్పచారం చేస్తూ పనిగట్టుకొని ఇలాంటి వార్తలు రాస్తున్నారని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు.