
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (తాజా చిత్రం)
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తల్లిపై వేసిన ఒట్టును పక్కనపెట్టి మరీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మళ్లీ స్పందించటం మొదలుపెట్టారు. పక్కదోవ పట్టిస్తున్న వెధవలను పక్కనపెట్టి వాస్తవాలను గ్రహించాలంటూ పవన్‌కు వర్మ సలహా ఇస్తున్నారు. ఇక పవన్ రవిప్రకాశ్‌పై ఓ వీడియో పోస్టుపై స్పందిస్తూ.. హే పవన్ కల్యాణ్ అది కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం వీడియో.. లక్షలసార్లు సర్క్యూలేట్ అయ్యింది. ఆ వీడియో పెట్టమని నీకు సలహా ఇచ్చిన వెధవలను పక్కన పెట్టేయ్. వాళ్లు రాజు రవితేజ కంటే చాలా ప్రమాదకరం’ అంటూ మరో ట్వీట్ చేశారు.
అతనికే(రవి ప్రకాశ్) కాదు.. ప్రతీ ఒక్కరికీ అది పాతదనే తెలుసు. దానిపై అతను వివరణ కూడా ఇచ్చాడు. నీ పక్కనున్న వారే అది ఎవరికీ తెలిదని నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిని పక్కనపెట్టు అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు. కాస్టింగ్ కౌచ్ బాధితులను, అప్పారావ్ లాంటి వాళ్ల దౌర్జన్యాలకు బలైన వారిని పవన్ వ్యభిచారుణులతో పోల్చటంపై ఆయన అభ్యంతరం చేస్తూ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ వాళ్లంతా వ్యభిచారిణులు అంటే, మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించకపోవడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిల పైన ఇంత హేవభావం ఎక్కువా?’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
ఇక నిన్నంతా రవిప్రకాశ్‌పై విరుచుకుపడ్డ పవన్.. ఈ రోజు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేయటం ప్రారంభించేశారు.
Hey @PawanKalyan this is not new expose ...its 5 years old and u must be last to see this OLD video circulated million times ..please kick out the immidiate idiots who advised u to put it out..They are more dangerous to u than that idiot Raju Ravi teja of Pawanism https://t.co/JETIcaawhD
— Ram Gopal Varma (@RGVzoomin) 21 April 2018
Not him , but everyone knows this 5 year old incident which he already explained ..only ur people are lying to u saying nobody knows ..keep them away
— Ram Gopal Varma (@RGVzoomin) 21 April 2018
నమ్మలేని షాక్ కాస్టింగ్ కౌచ్ బాధితులని,వాకాడ అప్పారావ్ లాంటి మగాళ్ల దౌర్జన్యాలాలకి గురయిన అమ్మాయిలని,పవన్ కళ్యాణ్ వాళ్లంతా వ్యభిచారిణులు అంటే, మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించకపోవడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిల పైన ఇంత హేవభావం ఎక్కువా? pic.twitter.com/Je9ArxIGcu
— Ram Gopal Varma (@RGVzoomin) 21 April 2018
Comments
Please login to add a commentAdd a comment