డీ గ్లామరస్‌గా కనిపిస్తా! | Muskan Sethi talking about Radhakrishna movie | Sakshi
Sakshi News home page

డీ గ్లామరస్‌గా కనిపిస్తా!

Published Sun, Sep 6 2020 3:45 AM | Last Updated on Sun, Sep 6 2020 3:45 AM

Muskan Sethi talking about Radhakrishna movie - Sakshi

ముస్కాన్‌ సేథీ

శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘రాధాకృష్ణ’. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సోషియల్‌ డ్రామా ఇది. ఇందులో ‘పైసా వసూల్‌’ ఫేమ్‌ ముస్కాన్‌ సేథీ లీడ్‌ రోల్‌లో నటిస్తారు. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించనున్నారామె. ఈ సినిమాలో తన పాత్ర గురించి ముస్కాన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రకథ నిర్మల్‌ ప్రాంతంలో జరుగుతుంది. ఆ ఊరి సంప్రదాయాలు, కట్టుబాట్లను మా సినిమాలో చూపించనున్నాం.

మా బామ్మ పాత్ర ఆ ఊరి పెద్దలా కనిపిస్తారు. ఇందులో మేకప్‌ లేకుండా డీ–గ్లామరస్‌గా కనిపిస్తాను. పూర్తి స్థాయి పల్లెటూరి పాత్ర చేయడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం లంగా వోణీలో కనిపిస్తాను. సుమారు 30రోజుల పాటు నిర్మల్‌లో ఆ ఊరి విశేషాలన్నీ తెలుసుకున్నాను. కుండలు తయారు చేయడం, పెయింటింగ్‌ నేర్చుకున్నాను. నా పాత్ర అందరికీ కనెక్ట్‌ అవుతుందనుకుంటున్నాను. తెలంగాణ యాస సరిగ్గా పలకడం కోసం ఓ ట్యూటర్‌ను పెట్టుకున్నాను. నా డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి అనుకుంటున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement