
‘బాహుబలి’ సక్సెస్‌తో ‘ప్యాన్ ఇండియన్ స్టార్’గా మారిపోయారు ప్రభాస్. ఆ నెక్ట్స్ ఆయన నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’ మంచి వసూళ్లను రాబట్టగలిగింది. ‘సాహో’ వంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రస్తుతం ఓ ప్రేమకథ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1970 నేపథ్యంలో పీరియాడికల్ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటలీలో ముగిసింది. తర్వాతి షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్‌తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఓ భారీ సెట్‌ను తయారు చేస్తున్నారు. పీరియాడికల్ మూవీ కాబట్టి ఆ కాలాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కళాదర్శకడు రవీందర్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
బుధవారం ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించి, ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఇటీవల హాలిడేలో భాగంగా ప్రభాస్ ప్యారిస్ వెళ్లారు. ఆయన బర్త్‌డే వేడుకలు అక్కడే జరుగుతాయని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. దాదాపు నెల రోజులుగా ‘మా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ 23వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అభిమాన హీరోకి సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment