తగ్గిన ‘రాధేశ్యామ్‌’ వ్యూస్‌.. యూట్యూబ్‌ టీమ్‌ ఏమందంటే.. | Youtube Gives Clarity on Radheshyam Views Count Down | Sakshi
Sakshi News home page

Radhe Shyam: తగ్గిన ‘రాధేశ్యామ్‌’ వ్యూస్‌.. యూట్యూబ్‌ టీమ్‌ ఏమందంటే..

Published Wed, Oct 27 2021 3:35 PM | Last Updated on Wed, Oct 27 2021 5:19 PM

Youtube Gives Clarity on Radheshyam Views Count Down - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, పూజా హేగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’.  ఇటలీలో జరిగే పీరియాడికల్‌ ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ రెబల్‌ స్టార్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది.

అత్యధిక వ్యూస్‌ సంపాదించి రికార్డు క్రియేట్‌ చేసి దూసుకుపోతోంది ఈ టీజర్‌. అయితే ఈ విషయంలో అనుకోకుండా చిన్న సమస్య వచ్చింది. 63 మిలియన్‌గా ఉన్న వ్యూస్‌ ఒక్కసారిగా 62 మిలియన్లకి పడిపోయాయి. ఇది గమనించిన నెటిజన్లు ఎందుకిలా జరిగింది అంటూ యూట్యూబ్‌ టీమ్‌కి ట్విటర్‌లో మేసేజ్‌ పెట్టారు. అభిమానుల ట్వీట్‌లకి స్పందించిన ఆ టీమ్‌ కారణాన్ని తెలియజేసింది. 

‘యూట్యూబ్‌ వ్యాలిడేట్‌ చేసే విధానం వల్ల వ్యూస్‌ అప్డేట్‌ చేయడంలో ఆలస్యం జరుగుతుంటుంది. ఒక్కోసారి తాత్కాలికంగా నెమ్మదించడం లేక వ్యూస్‌ ఫ్రీజ్‌ అవ్వడం జరుగుతుంటుంది’ అని ఆ టీమ్‌ తెలిపింది. ​కాగా ‘రాధేశ్యామ్‌’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.

చదవండి: నాకు అన్ని తెలుసు.. కానీ చెప్పను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement