సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్ణయాలపై ఊహాజనిత వార్తలు, అసత్య కథనాలను రాస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా ? నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపు పైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్. సీఎం పేషీలో ఎవరుండాలో నిర్ణయించడానికి తమరి పార్టనర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నావా?' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. (చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు..)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలల రూపు రేఖలు మార్చి నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పిల్లల్ని చదివించే ఏ తల్లి దండ్రులు ఆర్ధికగా ఇబ్బందులు పడకూడదని, అమ్మ ఒడి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులతో పాటు, నాడు–నేడుతో కార్పొరేట్ స్థాయి విద్యావసతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలు తెరిచిన మొదటి రోజే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, బ్యాగ్, బూట్లు, సాక్స్, బెల్ట్ అందజేయాలని నిర్ణయించారు' అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. (ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్ ఆంధ్రజ్యోతి)
Comments
Please login to add a commentAdd a comment