=బంధువుల ఆరోపణ
= న్యాయం కోసం ఆస్పత్రి వద్ద ఆందోళన
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : సాంసోనుది ఆత్మహత్య కాదు హత్యేనంటూ శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మసిపోగు సాంసోను(24), మేరి దంపతులు ఐదు నెలల కిందట దోసపాడుకు చెందిన రవి గేదెల ఫారంలో పనికి చేరా రు. ఉదయం రాత్రి అని తేడా లేకుండా పని చేయాలంటూ వారిని రవి చిత్రహింసలకు గు రి చేసేవాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా పనిచేయాలంటూ మేరిని వేధించేవాడు.
అతడి తీరుతో దంపతులు మనస్తాపం చెంది ఉయ్యూరులో ఉంటున్న సాంసోను తల్లిదండ్రులు సూరిబాబు, సువార్తమ్మ వద్దకు వ చ్చేశారు. ముదినేపల్లికి చెందిన రాధాకృష్ణ చేప ల చెరువు వద్ద వీరు రెండు నెలల కిందట పనికి చేరారు. ఇక్కడ కూడా వారిని యజ మా ని వేధించడంతో సాంసోను పనిమానేశారు. మేరి మాత్రం అక్కడే పనిచేస్తోంది. రవి, రాధాకృష్ణ వద్ద సాంసోను గతంలో రూ.20 వేలు అప్పు తీసుకున్నాడు. సొమ్ము కోసం వారు వారం రోజులుగా అతడిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రవి, రాధాకృష్ణ తన సోదరుడిని తీసుకెళ్లి హత్య చేశారని సాంసోను అక్క సరోజ ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు.
సెల్‌ఫోన్‌లో ఇలా రికార్డయి ఉంది..
సాంసోను తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ ఫోన్‌లో రికార్డు చేశాడు. అతడు చెప్పిన సమాచారం ప్రకారం.. ‘రవి, రాధాకృష్ణలకు నేను రూ.20 వేలు బాకీ ఉన్నాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేకపోతున్నాను. త్వరలో బాకీ తీర్చుతాను అని చెప్పాను. రాధాకృష్ణ వ ద్ద పనిచేస్తున్న నా భార్య సోమవారం రాత్రి నుంచి కనబడకపోవడంతో అతడి వద్దకు వెళ్లి నా భార్య ఏది? అని అడిగా.. నీ భార్య ఏమైందో ఎవరికి తెలుసు..? ఎవరితోటి వెళ్లిపోయిందో..’ అంటూ దుర్భాషలాడి నా మనసును గాయపర్చాడు. రా ధాకృష్ణ చిత్ర హింసల కారణంగా నా భార్య పుట్టింటికి వె.ళ్లిపోయింది.
గురువారం రాత్రి నేను ఉయ్యూరులో ఉండగా రవి, రాధాకృష్ణ, నరేష్, యేసోబులు వచ్చి బయటకు వెళ్దాం రమ్మన్నా రు. నా బండి మీద రవి, నరేష్ కూర్చున్నారు. మిగతా ఇద్దరూ ఆటోలో మమ్ములను వెం బడించారు. వానపాముల వద్దకు వచ్చిన తరువాత నరేష్ వాటర్ ప్యాకెట్ కోసం బండి ఆపాడు. రవి అక్కడి నుంచి బైక్‌ను దోసపాడు స్టేషన్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడితో రవి వెళ్లిపోయాడు. నేను స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరంలో రైలు పట్టాలపై పడుకున్నాను.
నా భార్యను రాధాకృష్ణ కొట్టినందుకు, నేను కట్టాల్సిన బాకీ తీర్చనందుకు మనస్తాపానికి గురయ్యాను. అం దుకే నేను..’ అని రికార్డయి ఉం ది. ఈ లోపు రైలు మీదకు ఎక్కడంతో అ తడు చనిపోయాడు. మృతుడి సెల్‌ఫోన్‌లో రికార్డయిన మాటలు, బంధువులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాంసోనుది హత్యే..
Published Sun, Dec 15 2013 1:27 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement