Phone record
-
అమ్మాయితో మాటల రికార్డింగ్..
సాక్షి, కాకినాడ రూరల్: అమ్మాయితో సెల్ఫోన్లో మాట్లాడిన మాటల రికార్డింగ్ వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. కాల్ రికార్డింగ్ వివాదం చినికిచినికి గాలివానలా మారి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తమ ఇంటిపైకి దాడికి వస్తారని భావించిన ఓ వర్గం, వచ్చిన వారిని తుదముట్టించాలని పథకం పన్నింది. కొందరు మనుషులను ముందుగానే తీసుకువచ్చి కత్తులతో మాటువేసింది. వారు ఊహించినట్టుగానే అర్ధరాత్రి సమయంలో ఇంటి పైకి వచ్చిన ముగ్గురిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆరుగురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో ఫిబ్రవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక జరిగిన కొవ్వూరి ఇంద్రారెడ్డి(50) హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గురువారం ఉదయం కాకినాడలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఉదయం హత్య కేసు, నిందితుల వివరాలను అడ్మిన్ ఎస్పీ కరణం కుమార్, ఇన్చార్జి డీఎస్పీ బీమారావు, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, పెదపూడి ఎస్సై లక్ష్మి వెల్లడించారు. గొల్లల మామిడాడలో కొవ్వూరి ఇంద్రారెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు మేడపాటి సూర్యనారాయణరెడ్డి(ఏ–1)తో పాటు బిక్కవోలుకు చెందిన జంపా రాజు(ఏ–2), ధనాల మనోజ్‌కుమార్(ఏ–3), తోట ద్రావిడ్(ఏ–4), బీరా సాయికుమార్(ఏ–5), పంపన విజయకుమార్(ఏ–6)లను అరెస్టు చేశామన్నారు. హత్యకు వినియోగించిన కత్తులు గొల్లల మామిడాడలో ఓ అమ్మాయితో సెల్ ఫోన్లో మాట్లాడిన మాటల కాల్ రికార్డింగ్ విషయమై మేడపాటి సూర్యానారాయణరెడ్డి తాడి ఆనందరెడ్డిని కొట్టాడు. ఈ విషయాన్ని ఆనందరెడ్డి తన మేనమాన కొవ్వూరి ఇంద్రారెడ్డికి చెప్పాడు. దీంతో ఫిబ్రవరి 29న అర్ధరాత్రి సమయంలో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి అడిగేందుకు సూర్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లారు. రోజంతా దీనిపై వివాదం నెలకొనడం, అడిగేందుకు ఇంటికి వస్తారని తెలుసుకున్న సూర్యానారాయణరెడ్డి ముందు జాగ్రత్తగా బిక్కవోలు నుంచి కొందరిని రప్పించుకుని, ఇంటి వద్ద కత్తులతో మాటు వేయించాడు. ఇంతలో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి అక్కడికి రాగా వారిపై కత్తులతో దాడి చేసి కత్తులతో నరికారు. అతను అక్కడికక్కడే రక్తపు మడుగులతో మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మార్చి 1న ఉదయం ఏడు గంటలకు ఫిర్యాదు అందడంతో పెదపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనంతరం నిందితులు ఇతర ప్రాంతాలు పరారైనట్టు తెలుసుకుని సీఐ మురళీకృష్ణ, సిబ్బంది ఏలూరు, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలు గాలించారు. సూర్యనారయణరెడ్డి, రాజు, మనోజ్‌కుమార్, సాయికుమార్‌లో హైదరాబాద్‌లో బుధవారం ఒక టీవీ చానల్ వద్ద లొంగిపోవడానికి వెళ్లగా బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారమందుకున్న సీఐ మురళీకృష్ణ, సిబ్బందిని నిందితులను కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే మరో ఇద్దరు ద్రావిడ్, విజయకుమార్‌లను కూడా అరెస్టు చేశారు. నిందితుల నుంచి కత్తులు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
కోరిక తీరిస్తే రుణం ఇస్తా..
బుల్దానా: రుణం మంజూరు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళారైతును బ్యాంక్ మేనేజర్ కోరారు. ఈ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని దతాలా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు పంట రుణం కోసం ఈ నెల 18వ తేదీన స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ రాజేశ్ హివాసేను సంప్రదించారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మేనేజర్, ఫోన్ నంబర్‌ను అడిగి తీసుకుని తనతో ‘టచ్’లో ఉండాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారు. 22వ తేదీన బ్యాంక్ ప్యూన్ మనోజ్ చవాన్ ఆమెకు ఫోన్ చేసి.. మేనేజర్ కోరిక తీరిస్తే రుణం ఎక్కువ మంజూరవుతుందంటూ మాట్లాడాడు. అయితే, ఆ మహిళ వీరిద్దరి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ సంభాషణలతో కలిపి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్‌తోపాటు ప్యూను వారిని చూసి పరారయ్యారు. అయితే, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వందలాది మంది బ్యాంకుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బ్యాంక్ మేనేజర్‌తోపాటు ప్యూన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మేనేజర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును జిల్లా కలెక్టర్ నిరుపమా దాంగే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. -
‘నేను చేసేది పాపం కాదు.. క్షమాపణ చెప్పను’
ఆస్టిన్ : ‘నేను చేసేది పాపం కాదు.. నేను క్షమాపణలు చెప్పాలి.. కానీ అలా ఎప్పటికీ చెప్పను’అంటూ టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి చెప్పాడు. అతడు దాడికి పాల్పడటానికి ముందే తాను ఎందుకు దాడి చేస్తున్నానో అనే విషయాన్ని అతడి ఫోన్లో 25 నిమిషాలపాటు రికార్డింగ్ చేసి ముందే పెట్టుకున్నాడు. దీంతో అతడు ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లు స్పష్టమైంది. మూడు వారాల కిందట ఆస్టిన్‌లో మార్క్ కాండిట్ అనే వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోనే తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో పోలీసులకు అతడి ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఓ 25 నిమిషాల నిడివితో వీడియో లభించింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం తాను చేసేది తప్పుకాదని అతడు చెప్పాడు. తన చర్యను ఓ సైకోపాథ్గా వర్ణించుకుంటూ క్షమాపణలు చెప్పాల్సి ఉన్నా తాను ఎప్పటికీ చెప్పబోనని తెలిపాడు. బాల్యం నుంచే తన జీవితం చిందరవందరగా ఉందని, ఒక వేళ తనను బందించాలని వస్తే అప్పటికప్పుడే తనను పేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందులో రికార్డు చేసి పెట్టి ఉంచాడు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము అంతకంటే ఎక్కువ వివరాలు అందించలేమని పోలీసులు తెలిపారు. కాగా, మార్క్ రూమ్మేట్స్ను కొన్నిగంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. -
ఉద్యోగమిప్పిస్తే డబ్బులివ్వవా..?
► రూ. 3 లక్షలు ఇవ్వాల్సిందే ► ఎస్జీటీ అభ్యర్థిని డిమాండ్ చేసిన డీఈఓ కార్యాలయ ఉద్యోగి ► సంభాషణను రికార్డు చేసిన అభ్యర్థి ► విచారణకు ఆదేశించిన డెరైక్టర్..? అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనుకున్నట్టుగానే నీకు టీచరు ఉద్యోగం వచ్చేలా చేశా. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయంలోని పని చేస్తున్న సూపరింటెండెంట్ సహకారంతోనే నీకు ఉద్యోగం వచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా రూ. 3 లక్షలు ఇవ్వాలి. ఉద్యోగంలో కూడా చేరేశావు.. ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా? నాకు మర్యాద పోతోంది. వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందేన’ంటూ డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి డీఎస్సీ-14లో ఎస్జీటీగా ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థి నుంచి డిమాండ్ చేశారు. ఇవీ వివరాలు... కదిరి ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి డీఎస్సీ-14 ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగితో పరిచయమైంది. పోస్టు రావడానికి ఖర్చయినా ఫర్వాలేదు ఏదైనా మార్గం ఉంటే చూడాలంటూ అభ్యర్థి సదరు ఉద్యోగిని కోరాడు. తనకు డెరైక్టరేట్ కార్యాలయంలో డీఎస్సీ విభాగంలో పని చేసే ఓ సూపరింటెండెంట్‌తో బాగా పరిచయాలున్నాయని, ఆయన అనుకుంటే నీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పాడు. దీనికి సదరు అభ్యర్థి కూడా అంగీకరించాడు. అయితే పరీక్ష తర్వాత ఫలితాల్లో సదరు అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తాను కష్టపడి చదవడం వల్లే ఉద్యోగం సంపాదించానని అభ్యర్థి అంటున్నాడు. అన్నీ అనుమానాలే..! డీఇఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి నిజంగానే ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు అభ్యర్థిని పాస్ చేయించారా..? లేకపోతే పాస్ అయితే డబ్బులు తీసుకుందాం... లేకపోతే ప్రయత్నించాను కానీ పని కాలేదనీ చెబుతాం అని అనుకున్నాడా అన్న అనుమానాలూ లేకపోలేదు. మరోవైపు అభ్యర్థి కూడా నిజంగా చదివి పాస్ అయ్యాడా..? లేకపోతే సదరు డీఇఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగే ఈ పనిని చేయించాడా అన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే... ఇది నాకు సంబంధం లేని అంశం. వాళ్లు వాళ్లు చేసుకుంటే నేనేం చేయాలి చెప్పు. కార్యాలయంలో జరిగితే దాని గురించి మాట్లాడతా.. అని వివరణ ఇచ్చారు. డెరైక్టర్ కార్యాలయం నుంచి ఏమైనా అడిగారా అన్న ప్రశ్నిస్తే దాటవేసే సమాధానం చెప్పారు. డబ్బు కోసం ఒత్తిడి ఎస్జీటీ ఉద్యోగం పొందిన అభ్యర్థిని మాత్రం సదరు ఉద్యోగి డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నాడు. అయితే తాను కష్టపడి చదివినందువల్లే ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నా అభ్యర్థి చెబుతున్నా ఆ ఉద్యోగి మాత్రం ససేమిరా అంటున్నాడు. నేను డెరైక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్‌తో మాట్లాడి నీకు ఉద్యోగం వచ్చేలా చేశాన’ంటూ ఉద్యోగి చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నేరుగా సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడించాడు. ఈ సంభాషణంతా సదరు అభ్యర్థి ఫోన్లో రికార్డు చేశాడు. చివరకు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ఫోన్ సంభాషణ వినిపించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
కాపాడలేదు కానీ, రికార్డు చేశారు!
తిరువనంతపురం: ఓ మహిళ రైలు పట్టాలు దాటుతోంది. దగ్గర్లో రైలొస్తోంది. ఆమె భయంతో సొమ్మసిల్లింది.. దగ్గర్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ఆమెను పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడతారు. కానీ ఆ ఇద్దరు యువకులు మాత్రం జేబుల్లోంచి సెల్ఫోన్లు తీశారు. సొమ్మసిల్లి పడిపోయిన ఆమె పైనుంచి రైలు వెళ్లిన బీభత్సాన్ని ఫోన్లలో రికార్డు చేశారు! మానవత్వం ఉనికిని ప్రశ్నించే ఈ ఉదంతం కేరళలోని కొట్టాయం జిల్లా ముత్తాంబళంలో బుధవారం చోటుచేసుకుంది. లైలా తంగచ్చన్(47) పట్టాలు దాటుతుండగా పరశురాం ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైల్వేగేటు కాపలాదారు రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ఎర్రజెండా ఊపినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి ముందు.. ఆమెకు దగ్గర్లో ఉన్న యువకులు ఆమెను కాపాడకుండా ఫోన్లలో ఆ ఘటనను చిత్రీకరించారు. -
సాంసోనుది హత్యే..
=బంధువుల ఆరోపణ = న్యాయం కోసం ఆస్పత్రి వద్ద ఆందోళన గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : సాంసోనుది ఆత్మహత్య కాదు హత్యేనంటూ శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మసిపోగు సాంసోను(24), మేరి దంపతులు ఐదు నెలల కిందట దోసపాడుకు చెందిన రవి గేదెల ఫారంలో పనికి చేరా రు. ఉదయం రాత్రి అని తేడా లేకుండా పని చేయాలంటూ వారిని రవి చిత్రహింసలకు గు రి చేసేవాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా పనిచేయాలంటూ మేరిని వేధించేవాడు. అతడి తీరుతో దంపతులు మనస్తాపం చెంది ఉయ్యూరులో ఉంటున్న సాంసోను తల్లిదండ్రులు సూరిబాబు, సువార్తమ్మ వద్దకు వ చ్చేశారు. ముదినేపల్లికి చెందిన రాధాకృష్ణ చేప ల చెరువు వద్ద వీరు రెండు నెలల కిందట పనికి చేరారు. ఇక్కడ కూడా వారిని యజ మా ని వేధించడంతో సాంసోను పనిమానేశారు. మేరి మాత్రం అక్కడే పనిచేస్తోంది. రవి, రాధాకృష్ణ వద్ద సాంసోను గతంలో రూ.20 వేలు అప్పు తీసుకున్నాడు. సొమ్ము కోసం వారు వారం రోజులుగా అతడిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రవి, రాధాకృష్ణ తన సోదరుడిని తీసుకెళ్లి హత్య చేశారని సాంసోను అక్క సరోజ ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. సెల్ఫోన్లో ఇలా రికార్డయి ఉంది.. సాంసోను తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ ఫోన్లో రికార్డు చేశాడు. అతడు చెప్పిన సమాచారం ప్రకారం.. ‘రవి, రాధాకృష్ణలకు నేను రూ.20 వేలు బాకీ ఉన్నాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేకపోతున్నాను. త్వరలో బాకీ తీర్చుతాను అని చెప్పాను. రాధాకృష్ణ వ ద్ద పనిచేస్తున్న నా భార్య సోమవారం రాత్రి నుంచి కనబడకపోవడంతో అతడి వద్దకు వెళ్లి నా భార్య ఏది? అని అడిగా.. నీ భార్య ఏమైందో ఎవరికి తెలుసు..? ఎవరితోటి వెళ్లిపోయిందో..’ అంటూ దుర్భాషలాడి నా మనసును గాయపర్చాడు. రా ధాకృష్ణ చిత్ర హింసల కారణంగా నా భార్య పుట్టింటికి వె.ళ్లిపోయింది. గురువారం రాత్రి నేను ఉయ్యూరులో ఉండగా రవి, రాధాకృష్ణ, నరేష్, యేసోబులు వచ్చి బయటకు వెళ్దాం రమ్మన్నా రు. నా బండి మీద రవి, నరేష్ కూర్చున్నారు. మిగతా ఇద్దరూ ఆటోలో మమ్ములను వెం బడించారు. వానపాముల వద్దకు వచ్చిన తరువాత నరేష్ వాటర్ ప్యాకెట్ కోసం బండి ఆపాడు. రవి అక్కడి నుంచి బైక్‌ను దోసపాడు స్టేషన్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడితో రవి వెళ్లిపోయాడు. నేను స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరంలో రైలు పట్టాలపై పడుకున్నాను. నా భార్యను రాధాకృష్ణ కొట్టినందుకు, నేను కట్టాల్సిన బాకీ తీర్చనందుకు మనస్తాపానికి గురయ్యాను. అం దుకే నేను..’ అని రికార్డయి ఉం ది. ఈ లోపు రైలు మీదకు ఎక్కడంతో అ తడు చనిపోయాడు. మృతుడి సెల్ఫోన్లో రికార్డయిన మాటలు, బంధువులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.