ఓ మహిళ రైలు పట్టాలు దాటుతోంది. దగ్గర్లో రైలొస్తోంది. ఆమె భయంతో సొమ్మసిల్లింది.. దగ్గర్లో ఎవరైనా ఉంటే ఏం
తిరువనంతపురం: ఓ మహిళ రైలు పట్టాలు దాటుతోంది. దగ్గర్లో రైలొస్తోంది. ఆమె భయంతో సొమ్మసిల్లింది.. దగ్గర్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ఆమెను పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడతారు. కానీ ఆ ఇద్దరు యువకులు మాత్రం జేబుల్లోంచి సెల్‌ఫోన్లు తీశారు. సొమ్మసిల్లి పడిపోయిన ఆమె పైనుంచి రైలు వెళ్లిన బీభత్సాన్ని ఫోన్లలో రికార్డు చేశారు! మానవత్వం ఉనికిని ప్రశ్నించే ఈ ఉదంతం కేరళలోని కొట్టాయం జిల్లా ముత్తాంబళంలో బుధవారం చోటుచేసుకుంది.
లైలా తంగచ్చన్(47) పట్టాలు దాటుతుండగా పరశురాం ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైల్వేగేటు కాపలాదారు రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ఎర్రజెండా ఊపినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి ముందు.. ఆమెకు దగ్గర్లో ఉన్న యువకులు ఆమెను కాపాడకుండా ఫోన్లలో ఆ ఘటనను చిత్రీకరించారు.