ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు
మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు.. అంటూ ఏబీఎన్‌లో వార్తలు
కేసీఆర్ పాత్రను ఈడీకి కవిత వివరించారంటూ వార్త ప్రసారం
కోర్టు వాదనలను వక్రీకరించిన ఏబీఎన్
ఈటీవీ సహా 16 చానళ్లపై వివిధ పోలీసుస్టేషన్లలోనూ ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యక్తిత్వాన్ని దిగ జార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై కూడా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీసు స్టేషన్‌లో, ఇతర చానళ్లపై బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనల్లో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్‌లు, వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ‘మార్గదర్శి మా నాన్న.. మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు’ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్న ట్లు ఈడీ తేల్చిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసిందని వివరించారు.
ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదును పెన్‌డ్రైవ్ ద్వారా బీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వార్త పూర్తి సారాంశాన్ని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసే సమ యంలో కేసీఆర్, కవిత ఫొటోలతో పాటు ఈడీ, మద్యం సీసాల క్లిప్పింగులను జత చేశారని తెలి పారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్‌రావు.. కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపై ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నింది తుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత, కేసీఆర్‌కు ఆపాదిస్తూ ఏబీఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు.
కేసీఆర్, కవిత, బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. న్యాయవిచారణ అంశాల ను కూడా ఏబీఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యా నాలతో తప్పుదోవ పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశా రని పేర్కొన్నారు. దీంతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరక్టర్ భానుకృష్ణ, ఈడీ పి.వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణ కు మార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్‌తో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ ఇమేజీని దెబ్బ తీసేందుకే..
వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ స్థాయి, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసిందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన తెలంగాణ భవన్‌లో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ 6, ఎన్‌టీవీ, ఐ న్యూస్, అమ్మ టీవీ, బీఆర్‌కే, డైలీ న్యూస్, జర్నలిస్టు సాయి చాన ల్, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్, ఆర్ టీవీ, రాజ్‌న్యూస్, రెడ్ టీవీ, వైల్డ్ ఓల్ప్.. తది తర 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై పోలీసు లకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment