రెండువేల ఏళ్లనాటి కంప్యూటర్‌..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు | Discovery Of 2000 Year Old Computer At 120 Years Ago | Sakshi
Sakshi News home page

వేల ఏళ్ల క్రితమే కంప్యూటర్‌ని కనిపెట్టారా..? విస్తుపోయిన శాస్త్రవేత్తలు

Published Wed, Aug 7 2024 10:17 AM | Last Updated on Wed, Aug 7 2024 5:14 PM

Discovery Of 2000 Year Old Computer At 120 Years Ago

చాలా ఆవిష్కరణలు మనమే కొత్తగా కనిపెట్టాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోని అపార మేధాతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఆయా వస్తువులు బయటపడితే గానీ నమ్మం. ఆ టైంలోనే వాళ్లు ఇంత టెక్నాలజీని కనిపెట్టారా..? అని అబ్బురపడతాం. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.

ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని అయిన కంప్యూటర్‌ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపై ఆధారపడిపోయాం. అలాంటి కంప్యూటర్‌ వేల ఏళ్లక్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే నమ్ముతారా..?. కానీ ఇది నమ్మకతప్పని నిజం. శాస్త్రవేత్తలు సైతం ఆ కంప్యూటర్‌ని చూసి అబ్బురపడ్డారు. 

అసలేం జరిగిందంటే..మొదటి కంప్యూటర్‌గా పిలిచే 'యాంటికిథెరా' అనే రెండు వేల ఏళ్ల పరికరాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది ఒక ఖగోళ క్యాలెండర్‌గా పేర్కొన్వచ్చు. దీన్ని 1901 నాటి గ్రీకు నౌక ప్రమాదంలో కనుగొన్నారు. అంటే సుమారు 120 ఏళ్ల క్రితం ఈ పరికరాన్ని కనుగొన్నారు. అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థంగాక శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. 

ఇది చేతితో నడిచే పరికరం. ఈ పరికరాంలో సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండ్-అప్ వ్యవస్థను ఉపయోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుని దశలు, గ్రహాణ సమయాలు గుర్తించే క్యాలెండర్‌ మాదిరిగా పనిచేసేది. ఇది సాధారణ ప్రయోజనాలకోసం ఉపయోగించి కంప్యూటరే అయినా వెయ్యి ఏళ్ల క్రితమే ఏ ఇతర సాధనల్లో ఇంత మెకానిజం లేదు. పైగా ఇది అధునాతమైనది కూడా. 

ఇక ఈ కంప్యూటర్‌ మెకానిజం 82 వేర్వేరు శకలాలుగా ఉంది. అసలు నిర్మాణంలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 30 తుప్పుపట్టిన కాంస్య గేర్‌వీల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇదేలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్‌ మోడలింగ్‌ను ఉపయోగించారు. అప్పుడే ఇది గొప్ప మేధావి సృష్టించిన అద్భుతంగా గుర్తించారు. తాము పునర్‌నిర్మించిన ఈ త్రీడీ మోడల్‌ తమ వద్ద ఉన్న ఆధారాలకు సరిపోలుతుందని చెప్పారు.

అంతేగాదు ఈ పరికరం సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల కదలికలను కేంద్రీకృత వలయాలపై ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఆ రోజుల్లేనే ఖగోళ వస్తువులు భూమి చుట్టు తిరుగుతాయని పురాతన గ్రీకులు నమ్మేవారని తెలుస్తుందన్నారు. అంతేగాదు ఈ పురాతన పరికరాన్ని బాబిలోనియన్ ఖగోళశాస్త్రం, ప్లేటోస్ అకాడమీ గణిత, పురాతన ఖగోళశాస్త్ర సిద్ధాంతాల కలియికతో ఆవిష్కరించినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement