ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. | HP Announces Special Discounts On Gaming Laptops | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..

Published Mon, Mar 4 2024 10:58 AM | Last Updated on Mon, Mar 4 2024 12:01 PM

HP Announces Special Discounts On Gaming Laptops - Sakshi

ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్‌, ప్రింటర్స్ తయారీదారు హెచ్‌పీ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చవకైన గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ తీసుకురావడంపై దృష్టి సారించింది. తక్కువ ధరలో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ల్యాప్‌టాప్స్‌ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్‌ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌పీ భారీ డిస్కౌంట్లతో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను ఇండియన్ మార్కెట్‌కి తీసుకొస్తుంది.

‘లూట్ డ్రాప్ సేల్’ పేరుతో హెచ్‌పీ కంపెనీ ఒమెన్, విక్టస్ ల్యాప్‌టాప్‌లు, హెడ్‌సెట్‌లు, మైక్రోఫోన్‌లు, కీబోర్డ్, మౌస్, మౌస్ ప్యాడ్ వంటి గేమింగ్ ఉపకరణాలపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌లు అన్ని హెచ్‌పీ స్టోర్‌లు, హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్లు, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో మార్చి 3 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

హెచ్‌పీ ఒమెన్‌ 16 ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 15% డిస్కౌంట్‌ ఇస్తున్నారు. రూ.1,75,930 విలువైన 14వ జనరేషన్‌ ఒమెన్‌ 16 ల్యాప్‌టాప్‌ ఇప్పుడు రూ. 1,49,999కే లభిస్తుంది. 13వ జనరేషన్‌ ఒమెన్‌ 16 ల్యాప్‌టాప్‌ రూ.1,32,645 బదులుగా రూ.1,12,999 వస్తుంది.

ఇదీ చదవండి: జనరేటివ్‌ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..?

ఒమెన్‌ 16 ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై ప్రముఖ బ్యాంకులతో రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందే సౌకర్యం కూడా ఉంది. హెచ్‌పీ మౌస్, మౌస్ ప్యాడ్, హెడ్‌సెట్‌తో సహా హైపర్‌ ఎక్స్‌ కొనుగోలుపై రూ.2,999 తగ్గిస్తున్నారు. హైపర్‌ ఎక్స్‌ క్లచ్ గేమ్ కంట్రోలర్‌పై రూ.999 డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement