discount charges
-
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ తయారీదారు హెచ్‌పీ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చవకైన గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకురావడంపై దృష్టి సారించింది. తక్కువ ధరలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ల్యాప్టాప్స్ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌పీ భారీ డిస్కౌంట్లతో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను ఇండియన్ మార్కెట్‌కి తీసుకొస్తుంది. ‘లూట్ డ్రాప్ సేల్’ పేరుతో హెచ్‌పీ కంపెనీ ఒమెన్, విక్టస్ ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్లు, మైక్రోఫోన్లు, కీబోర్డ్, మౌస్, మౌస్ ప్యాడ్ వంటి గేమింగ్ ఉపకరణాలపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని హెచ్‌పీ స్టోర్లు, హెచ్‌పీ ఆన్లైన్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మార్చి 3 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హెచ్‌పీ ఒమెన్ 16 ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.1,75,930 విలువైన 14వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ. 1,49,999కే లభిస్తుంది. 13వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ రూ.1,32,645 బదులుగా రూ.1,12,999 వస్తుంది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..? ఒమెన్ 16 ల్యాప్‌టాప్ కొనుగోలుపై ప్రముఖ బ్యాంకులతో రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందే సౌకర్యం కూడా ఉంది. హెచ్‌పీ మౌస్, మౌస్ ప్యాడ్, హెడ్‌సెట్‌తో సహా హైపర్ ఎక్స్ కొనుగోలుపై రూ.2,999 తగ్గిస్తున్నారు. హైపర్ ఎక్స్ క్లచ్ గేమ్ కంట్రోలర్‌పై రూ.999 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
TS: చలాన్ల చెల్లింపులపై భారీ స్పందన.. రూ. 67 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76లక్షలకు పైగా చలాన్లను క్లియర్ చేసుకున్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ కట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 77 లక్షల చలాన్లు క్లియర్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ చలాన్లకు సంబంధించి శనివారం వరకు రూ. 67 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. ట్రాఫిక్ చలాన్ల వెబ్సైట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫేక్ చలాన్ వెబ్సైట్లను నిలిపివేశామని తెలిపారు. మరోవైపు.. చలాన్ల పెండింగ్‌పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. ఈనెల పదో తేదీ వరకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. -
స్పైస్‌జెట్ హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానయాన సంస్థ కలర్ ద స్కైస్ పేరుతో తాజాగా మరో డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ రూట్లలో కనిష్టంగా రూ.1,699కు, అంతర్జాతీయ రూట్లలో రూ.3,799కు (అన్ని చార్జీలు కలుపుకొని) విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ చార్జీలకు లక్ష సీట్లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవ్లి పేర్కొన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన బుకింగ్స్ గురువారం (రేపు-ఈ నెల 26) వరకూ ఉంటాయని, వచ్చే నెల 1 నుంచి ఏప్రిల్ 20 వరకూ చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. ప్రయాణికులు హోలీ పండుగ పర్యాటక ప్రణాళికలకు ఈ ఆఫర్ మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ ఆఫర్లో భాగంగా హైదరాబాద్-విజయవాడ, బెంగళూరు-హైదరాబాద్, ఢిల్లీ-డెహ్రాడూన్, గౌహతి-కోల్‌కతా, అహ్మదాబాద్-ముంబై రూట్లలో విమాన టికెట్లను రూ.1,699కే అందిస్తున్నామని వివరించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం పాత ప్రమోటర్ అజయ్ సింగ్ చేతికి వచ్చిన ఒక్కరోజు తర్వాత తాజా ఆఫర్ రావడం విశేషం. స్పైస్‌జెట్ నుంచి ఈ ఏడాది ఇది ఐదో ఆఫర్. మళ్లీ ప్రమోటర్‌గా అజయ్‌సింగ్ స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్, కాల్ ఎయిర్‌వేస్‌లకు ఉన్న మొత్తం 56.4 శాతం వాటా(35,04,28,758 ఈక్విటీ షేర్లు), పాత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ అయింది. ఈ వాటా బదిలీతో ఇప్పుడు స్పైస్‌జెట్ యాజమాన్యం అజయ్‌సింగ్‌కు దక్కింది. కాగా, స్పైస్‌జెట్ రూ.100 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత)బకాయిలను చెల్లించినట్లు సమాచారం. ఎయిర్కోస్టా కూడా...హైదరాబాద్-విజయవాడ టికెట్ రూ. 999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన కంపెనీ అయిన ఎయిర్కోస్టా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఒకవైపు టికెట్ ధరను రూ.999గా నిర్ణయించింది. రూ.999కే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖపట్నానికి, రూ.1,999తో హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కు, బెంగళూరు నుంచి విశాఖపట్నానికి, అలాగే రూ.1,499తో హైదరాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నం నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నానికి వెళ్లొచ్చు. ఈనెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎకానమీ టికెంట్ బుకింగ్స్ పైనే అది కూడా పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి. మార్చి 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణ తేదీలుగా నిర్ణయించింది.