ఎక్స్‌పీసీ...ఆల్ ఇన్ వన్! | XPC... All-in-One! | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పీసీ...ఆల్ ఇన్ వన్!

Published Wed, Jan 29 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

ఎక్స్‌పీసీ...ఆల్ ఇన్ వన్!

ఎక్స్‌పీసీ...ఆల్ ఇన్ వన్!

ఆఫీసుకెళితే కంప్యూటర్...
 ఆఫీసు పనులే
 ఇంట్లో చేసుకోవాలనుకుంటే...
 ల్యాప్‌టాప్. లేదంటే టాబ్లెట్.
 బంధు మిత్రులతో మాట్లాడుకోవాలంటే...
 స్మార్ట్ ఫోన్.
 ఆధునిక యుగంలో ఇదీ టెక్నాలజీ ట్రెండ్.
 ఇవేవీ లేకుండా...
 మీ చేతిలో ఇమిడిపోయే ఓ చిన్న గాడ్జెట్
 అవసరాన్నిబట్టి తన రూపాన్ని,
 పనితీరును మార్చుకుంటే...?
 ఐసీఈ ఎక్స్‌పీసీ చేసేది కూడా అచ్చంగా ఇదే!

 
సామర్థ్యం విషయంలో స్మార్ట్‌ఫోన్లకు, కంప్యూటర్లకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిపోతోంది. ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే ప్రాసెసర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. గిగాబైట్ల మెమరీ కూడా సిమ్‌కార్డు సైజుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ఆల్ ఇన్ వన్ మాడ్యులర్ పీసీ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ ఐస్ ఎక్స్‌పీసీ. చూసేందుకు ఇది స్మార్ట్‌ఫోన్ సైజులోనే ఉంటుందిగానీ... కంప్యూటింగ్ సామర్థ్యం విషయంలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకు ఏమాత్రం తీసిపోదు.
 
ఏముంటాయి?


ఎక్స్‌పీసీలో అత్యాధునిక ఎక్స్86 సీపీయూ ఉంటుంది. దీంతోపాటు రెండు నుంచి నాలుగు గిగాబైట్ల ర్యామ్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, కెమెరా, ఆక్సిలరోమీటర్, గైరో సెన్సర్ ఉంటాయి. అవసరాన్ని బట్టి 32 గిగాబైట్ల నుంచి 128 గిగాబైట్ల వరకూ మెమరీని పెంచుకోవచ్చు.  వంద గ్రాముల బరువు కూడా చేయని ఈ మాడ్యులర్ పీసీని చిన్నచిన్న పరికరాల సాయంతో ఎక్కడైనా వాడుకోవచ్చు.
 
డెస్క్‌టాప్ పీసీగా...


ఎక్స్‌ప్యాడ్ అనే పరికరంలోకి దీన్ని జొప్పించాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్యాడ్‌కు టీవీ మానిటర్‌ను, కీబోర్డును కలుపుకుని పీసీలా, లేదంటే ఆధునిక గేమింగ్ కన్సోల్‌గా మార్చుకోవచ్చు.
 
 టాబ్లెట్‌గా...


 చాలా సింపుల్. ఎక్స్‌ప్యాడ్ పేరుతో ఐసీఈ కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎక్స్‌ప్యాడ్‌ను వాడాలి. 10.1 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ టాబ్లెట్ మానిటర్ వెనుకభాగంలో ఎక్స్‌పీసిని జొప్పించేందుకు ఒక ఏర్పాటు ఉంటుంది. ఎక్స్‌పీసిని ఈ స్లాట్‌లోకి జొప్పిస్తే చాలు. టచ్‌స్క్రీన్ టెక్నాలజీతో పనిచేసే టాబ్లెట్ రెడీ!
 
 ఎక్స్‌పీసీ కీబోర్డు, స్టాండ్


 ఐసీఈ కంపెనీ అభివృద్ధి చేసిన మరో పరికరం కీబోర్డు. పీసీకైనా, టాబ్లెట్‌కైనా ఈ కీబోర్డు పనికొస్తుంది. కీబోర్డునే టాబ్లెట్ కోసం స్టాండ్‌గానూ వాడుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement