హైదరాబాద్: రియల్‌మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో, 11 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ డార్ట్ చార్జింగ్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో వైఫై వెర్షన్ ధర రూ.19,999.
ఇదే సామర్థ్యాలతో వైఫై, 5జీ సిమ్ సపోర్టెడ్ ట్యాబ్లెట్ ధర రూ.25,999. ఇందులో 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
అలాగే, రియల్‌మీ వాచ్3, ఒక ఫ్లాట్ మానిటర్, రియల్‌మీ బడ్స్ ఎయిర్3 నియో, రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2ఎస్ ఉత్పత్తులను కూడా సంస్థ విడుదల చేసింది.
చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్!
Comments
Please login to add a commentAdd a comment