ఆ నేడు సెప్టెంబర్ 4, 1998
సమాచార విప్లవం...
కంప్యూటర్ ముందు కూర్చున్న ఒకాయన దగ్గరికి ఒక పిల్లాడు వచ్చి -‘‘మా నాన్న కనిపించడం లేదు...కాస్త గూగుల్‌లో వెదికి పెడతారా!’’ అని అడిగాడట. ఆ పిల్లాడిది అమాయకత్వమో, అతివిశ్వాసమో, హాస్యమో తెలియదుగానీ... సారాంశంలో చెప్పుకోవాలంటే ‘గూగుల్ ఏ సమాచారాన్ని అయినా ఇవ్వగలదు’ అనే నమ్మకాన్ని ప్రపంచానికి ఇచ్చింది.
కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ స్టూడెంట్స్‌గా లారీ పేజ్, సెర్జిబ్రిన్‌లు ఉన్నప్పుడు జనవరి 1996లో రీసెర్చ్ ప్రాజెక్ట్‌గా గూగుల్ మొదలైంది. ఇంటర్నెట్ సంబంధిత సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన గూగుల్ సంస్థ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో సెప్టెంబర్ 4, 1998న స్థాపించబడింది. ఎప్పటికప్పుడు సరికొత్త సృజనాత్మక ఆలోచనలతో ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగింది. శక్తిమంతమైన సెర్చింజన్‌గా పేరు తెచ్చుకుంది.