విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్‌రావు అన్నారు...
- హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్‌రావు
మహేశ్వరం: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్‌రావు అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, కంప్యూటర్ రంగాల పై దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని మంఖాల్ హర్షిత్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవం, సైన్స్‌ఫెస్ట్‌లో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు.
తెలుగు మీడియం విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలన్నారు. నైపుణ్యతతో కూడిన విద్య నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జేఎన్‌టీయూ వైన్స్ చాన్స్‌లర్ డా.రమణరావు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హర్షిత్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ బుస్సు చెన్న కృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా.సుభాష్, అధ్యాపకులు, గ్రామసర్పంచ్ కౌసల్య, ఎంపీటీసీ సభ్యుడు మధు తదితరులు పాల్గొన్నారు.