కంప్యూటర్లు వృథా | no computer training in Kasturiba Schools | Sakshi
Sakshi News home page

కంప్యూటర్లు వృథా

Published Wed, Oct 23 2013 4:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

no computer training in Kasturiba Schools

మోర్తాడ్, న్యూస్‌లైన్ : కస్తూర్బా పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి గతంలో నియమించిన ఇన్‌స్ట్రక్టర్‌లను జిల్లా అధికార యంత్రాంగం తొలగించింది. బడి మానివేసిన విద్యార్థినులు, బాల కార్మికులుగా మారిన ఆడపిల్లలకు మళ్లీ మంచి చదువును అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కస్తూర్బా పాఠశాలను ప్రారంభించింది. రెగ్యులర్ విద్యార్థుల మాది రిగానే కస్తూర్బా విద్యార్థినులకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. చదువుతో పాటు కుట్లు, అల్లికలు, టైలరింగ్, కంప్యూటర్ రంగాలలో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడానికి ఇన్‌స్ట్రక్టర్‌లను నియమిం చారు. ఇన్‌స్ట్రక్టర్‌లకు నెలకు రూ 4500 వేతనాన్ని రాజీవ్ విద్యా మిషన్ అధికారులు చెల్లించేవారు.
 
 కస్తూర్బా పాఠశాలల్లో ఆరవతరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. విద్యార్థులకు కం ప్యూటర్ పరిజ్ఞానంలో ఒక రోజు థియరీ క్లాసులు, మరో రోజు ప్రాక్టికల్స్‌ను నిర్వహించేవారు. కస్తూ ర్బా పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినా ఇన్‌స్ట్రక్టర్‌ల నియామకం ఎక్కడా జరగలేదు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన క్రిస్టీనా ప్రత్యేక చొరవ చూపి కంప్యూటర్ శిక్షణకు ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్‌లను నియమించడానికి చర్యలు తీసుకున్నారు. రాజీవ్ విద్యా మిషన్ పథకానికి కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌ల వేతనం భారం అవుతుం దని గమనించిన ప్రస్తుత అధికార యంత్రాంగం కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌లను తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల ఆరంభం నుంచి ఇన్‌స్ట్రక్టర్‌లు పాఠశాలలకు రావడం మాని వేశారు.

కస్తూర్బా పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులను బోధిస్తు న్న ఉపాధ్యాయులే కంప్యూటర్ శిక్షణను విద్యార్థులకు అందించాలని అధికారులు ఆదేశించారు. కా గా ఉపాధ్యాయులలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు లేక పోవడంతో ల్యాబ్‌లను మూసి ఉం చుతున్నారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌ల నియామకం వల్ల విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందగా, అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. ఇప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ఇన్‌స్ట్రక్టర్‌లు వీధిన పడగా, విద్యార్థులకు శిక్షణ అందకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంప్యూటర్ శిక్షకుల పునర్నియామకం పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.
 
 ఉపాధ్యాయులతోనే శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం
 - రుక్మయ్య స్పెషల్ ఆఫీసర్, కస్తూర్బా పాఠశాల మోర్తాడ్
 కంప్యూటర్ ఇన్‌స్ట్రకర్‌లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉన్న ఉపాధ్యాయులతోనే శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్‌స్ట్రక్టర్‌లు ఉంటే బాగుండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement