
ఆ సుందరికి సొంత కంప్యూటర్ కూడా లేదట
ప్రముఖ హాలీవుడ్ సుందరి, టైటానిక్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారు మనసుల్లో శాశ్వత స్థానాన్ని దక్కించుకున్న కేట్ విన్స్లెట్.. తనకు కంప్యూటర్ కూడా లేదని చెప్పింది.
లండన్: ప్రముఖ హాలీవుడ్ సుందరి, టైటానిక్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారు మనసుల్లో శాశ్వత స్థానాన్ని దక్కించుకున్న కేట్ విన్స్లెట్.. తనకు కంప్యూటర్ కూడా లేదని చెప్పింది. సహజంగా తనకు సాంకేతిక పరిజ్ఞానం అంటే భయమని, చిరాకు అని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తన ఇంట్లో పిల్లలకు కూడా సోషల్ మీడియాలో అనుమతి లేదని చెప్పింది.
వారికి కేవలం తన ఐఫోన్ మాత్రమే అందుబాటులో ఉంచుతున్నానని, అందులో కూడా చాలా పరిమితులు పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం కేట్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పిల్లలను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని, వారి బాల్యాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాలని, సోషల్ మీడియా వారికి సహజ సిద్ధంగా లభించే అంశాలను హరించి వేస్తుందనే భయంతోనే అలాంటి వాటికి అనుమతించబోనని చెప్పింది. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకొని విడిపోయిన ఆమె సరిగ్గా రెండేళ్ల కిందటే నెడ్ రాకెన్ రోల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.