
పీసీ దుర్వినియోగానికి చెక్
కంప్యూటర్‌పై బిజీగా పనిచేస్తూ మధ్యమధ్యలో వేరే పనిమీద పక్కకు వెళ్లటం సర్వసాధారణం. కానీ, అదే సమయంలో అదనుచూసి కొందరు మన కంప్యూటర్‌ను దుర్వినియోగం చేస్తుం టారు.
కంప్యూటర్‌పై బిజీగా పనిచేస్తూ మధ్యమధ్యలో వేరే పనిమీద పక్కకు వెళ్లటం సర్వసాధారణం. కానీ, అదే సమయంలో అదనుచూసి కొందరు మన కంప్యూటర్‌ను దుర్వినియోగం చేస్తుం టారు. అలాంటి వారికి చెక్ పెట్టేదే ఈ కొత్తరకం ‘నియోఫేస్ మానిటర్’. మనం పక్కకు వెళ్లగానే ఆటోమేటిక్‌గా కంప్యూటర్ లాక్ అయిపోతుంది. మళ్లీ కంప్యూటర్ మానిటర్ ఎదురుగా మన ముఖం ఉన్నపుడు మాత్రమే అన్‌లాక్ అవుతుంది. ఈ కొత్త తరహా బయోమెట్రిక్ సెక్యూరిటీ సిస్టమ్‌ను జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘నెక్’ తయారు చేసింది. మంగళవారం టోక్యోలో కంపెనీ ఈ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించింది.