‘‘భవిష్యత్తు అవసరాలను సరైన సమయంలో అంచనా వేయడం వ్యాపారంలో ఒక విజయ రహస్యం. ఇలాంటి నిపుణత చదువులో కూడా ఉంటుంది. కొంచెం ఆలోచించి వ్యవహరిస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను సంపాదించిపెట్టే చదువులు చదవొచ్చు, ఇండస్ట్రీకి మన అవసరం ఏర్పడేలా చేసుకోవచ్చు...’’ అంటున్నాడు జార్ఖండ్‌కు చెందిన వినీత్ కుమార్. ఒక విజేత హోదాలో ఈ మాటలు చెప్పాడు.
ఇంటర్నెట్ వాడకం ఇప్పుడు విస్తృతం అయ్యింది. ఇదే సమయంలో ఎంతో సౌలభ్యంగా ఉన్న ఈ సేవ వల్ల అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. అలాంటి సమస్యల్లో ప్రధానమైనది ‘హ్యాకింగ్’ కంప్యూటర్, ఇంటర్నెట్ టెక్నాలజీల మీద పట్టు సంపాదించి కొంతమంది తమ తెలివితేటలను దుర్వినియోగం చేస్తూ వెబ్ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడం పెద్ద పెద్ద సంస్థలకే భారమవుతోంది. ఈ నేపథ్యంలో హ్యాకర్‌ల ఎత్తులను తిప్పికొట్టడానికి అవి ఎథికల్ హ్యాకర్లను నియమించుకొంటున్నాయి. దీంతో చాలామంది ఇప్పుడు నెట్‌వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్స్‌లో ఉద్యోగావకాశాల గురించి స్టడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిని ఆరేళ్ల కిందటే అంచనా వేసిన వారిలో ఒకడు వినీత్ కుమార్. ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సంపాదించి ప్రస్తుతం జార్ఖండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నాడు ఈ ఇరవెరైండేళ్ల యువకుడు.
పదహారేళ్ల వయసులో సొంతంగా కంపెనీ!
పదహారేళ్ల వయసులోనే ఎథికల్ హ్యాకర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు వినీత్‌కుమార్. ఇంటర్నెట్ ఇంకా ఇప్పటిలా విస్తృతం కాని సమయంలోనే ‘నేషనల్‌యాంటీ హ్యాకింగ్ గ్రూప్’ను స్థాపించాడు. హ్యాకింగ్‌ను నిరోధించడానికి ప్రోగ్రామ్స్‌ను డిజైన్ చేశాడు. గత ఐదారేళ్లలో సైబర్ క్రైమ్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వినీత్‌కు ప్రాధాన్యత పెరిగింది.
వినీత్ గురించి తెలుసుకొన్న జార్ఖండ్ పోలీసు శాఖ ‘సైబర్ సెక్యూరిటీస్’కు సహకారం అందించాల్సిందిగా కోరింది. అదే సమయంలో దేశంలో తొలిసారి ఆ రాష్ట్రంలోనే ‘సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెల్’ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ఏర్పరుస్తూనే వినీత్‌కు స్పెషల్ ఆఫీసర్ హోదా ఇచ్చారు.
ఏటీఎం క్లోన్స్, ఫేస్‌బుక్ ప్రొఫైల్ హ్యాకింగ్, వెబ్‌సైట్స్ హ్యాకింగ్, సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్‌ను కాపాడటం...మొదలైన కార్యక్రమాల ద్వారా వినీత్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో పోలీసులకు సహాయపడుతున్నాడు.
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు!
కేవలం దేశంలోనే గాక దేశం ఆవల కూడా వినీత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. వరల్డ్స్ యంగెస్ట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్‌గా అవార్డు తీసుకొన్నాడు. 2008 సంవత్సరంలో యూఎన్ యూత్ అసెంబ్లీ తరపున గోల్డ్‌మెడల్ గెలుచుకొన్నాడు.
తండ్రే స్ఫూర్తి...
‘నా విజయాలకు స్ఫూర్తి మా నాన్న. కలలను సాకారం చేసుకోవడానికి ఆయన ఎంతో సహకారం అందించాడు. ఎథికల్ హ్యాకింగ్ నా జీవితాన్ని మార్చేసింది. దీంట్లో ఎన్నో అవకాశాలున్నాయి. యువత దీనిపై దృష్టిసారించవచ్చు...’అంటున్నాడు వినీత్‌కుమార్.
వినీత్ గురించి తెలుసుకొన్న జార్ఖండ్ పోలీసు శాఖ ‘సైబర్ సెక్యూరిటీస్’కు సహకారం అందించాల్సిందిగా కోరింది. అదే సమయంలో దేశంలో తొలిసారి ఆ రాష్ట్రంలోనే ‘సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెల్’ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ఏర్పరుస్తూనే వినీత్‌కు స్పెషల్ ఆఫీసర్ హోదా ఇచ్చారు.
ఎథికల్ హ్యాకింగ్
Published Thu, Dec 26 2013 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement