Vineet Kumar
-
తమ్ముడూ... నీకు నడవడం నేర్పించాను... పొడవడం నేర్పించాను!
ఉత్తమ విలన్ వినీత్ కుమార్ ‘బావూజీకీ ఏంతెలుసు?’అలా అంటారేమిటండీ బాబూ... విన్నా వినగలడు. ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి...అదిగో... ‘విక్రమార్కుడు’ సినిమా నుంచి మనల్ని ఉరిమురిమి చూస్తున్నాడు!బావూజీ... అలా చూడకండి..మీ గురించి చిన్న పరిచయం చేసుకుంటున్నామంతే...మన బావూజీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎంత అంటే. ఇంత...‘నా రాజ్యం రామరాజ్యం.ఇక్కడ మర్డర్లుండవు. రేప్‌లు ఉండవు’అదేంటండీ... ఆయన మాట్లాడిందాట్లో తప్పేముంది?అలా అని బావూజీది ఆదర్శ రాజ్యం అనుకునేరు... పప్పులో నుంచి కాలు తీసి మిగతా వాక్యాలు కూడా వినండి...‘ఎవడైనా మాట వినకపోతే కదరా...మర్డర్ చేయాలి.ఎవరైనా రానంటే కదరా...రేప్ చేయాలి.ఎవడైనా ఇవ్వనంటే కదరా... మర్డర్ చేయాలి. అవ్వేమీ లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉంది’ ‘ప్రశాంతత’కు ఎంత చక్కని నిర్వచనం ఇచ్చాడో కదా ఈ విలనీయుడు! తన గురించి ప్రజల్లో ఉండే విశ్వాసం గురించి కూడా ఈ విలనీయుడికి వీరలెవెల్లో విశ్వాసం ఉంది.‘ఒక్కరు తెగించి ముందుకు వస్తే... ఈరోజు వీడి బతుకైపోతుంది. రండి’ జనాలతో అంటున్నాడు హీరో. ఈ మాటలు విన్న బావూజీ ఊరుకుంటాడా ఏమిటి?‘రండిరా రండిరా... క్యా రండిరా?’ అంటూ వెక్కిరిస్తూనే...‘వాళ్ల గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా... ఈ బావూజీ ముద్రలు’ అనగలడు.ఎంత కాన్ఫిడెన్సో!ఏడి... కనిపించడం లేదే...అదిగో ‘రామ రామ క్రిష్ణ క్రిష్ణ’ సినిమాలో కళ్లద్దాలు, సూటుబూటుతో ‘పవర్’గా మన ముందుకు వస్తున్నాడుబావూజీ. చూడండి ఆ కళ్లలో బాధ. ‘విక్రమార్కుడు’లో కొడుకు పోయిన బాధను కళ్లల్లో ఎర్రటి జీరతో ఎంత శక్తిమంతంగా వ్యక్తీకరించాడో! ఇప్పుడు తమ్ముడు పోయిన బాధలో ఏమంటున్నాడో చూడండి...‘తమ్ముడూ...నీకు నడవడం నేర్పించాను.పొడవడం నేర్పించాను.చంపడం నేర్పించాను’ఇంతకీ ఎవరీ నేర్పరి?వినీత్‌కుమార్ సింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు.‘విక్రమార్కుడు... బావూజీ’ అంటే మాత్రం చాలామంది గుర్తు పడతారు. ∙∙l వినీత్ కుమార్ స్వస్థలం పట్నా (బిహార్). బి.ఎన్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన వినీత్ పట్నా యూనివర్సిటీలో లా, సైకాలజీ పూర్తిచేశాడు. వినీత్‌కు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేది. ఎవరైనా మాట్లాడుకుంటుంటే వారి హావభావాలను గమనించడం. ఈ అలవాటే సైకాలజీలో పీజీ చేయడానికి ఉపకరించడమే కాదు... తన నటనకు అవసరమైన సరంజామాను అందించింది. అన్న ఐపీయస్కు సెలెక్ట్ కావడంతో వినీత్‌పై ఒత్తిడి పెరిగింది. ‘‘అన్నయ్యలాగే ఏదైనా మంచి ఉద్యోగం చెయ్’’ అని ఇంటా బయట సలహాలు. అయితే... వినీత్ మనసంతా నటనపై ఉంది. తండ్రిని తృప్తి పరచడానికి లా కాలేజీలో చేరాడు. ఆ సమయంలో బోలెడు తీరిక దొరకడంతో నాటకాలపై దృష్టి పెట్టాడు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, పట్నా విభాగంలో చేరాడు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’(ఎన్ఎస్డీ)లో చేరాడు. అక్కడ ఎందరో గొప్ప నటుల పరిచయం అయింది. నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ‘ద్రోహ్కాల్’ ‘శూల్’ ‘యే దిల్’ ‘మంజ్నాథ్’ ‘గాడ్‌మదర్’ ‘దౌడ్’ ‘మసాన్’... మొదలైన బాలీవుడ్ సినిమాలతో వినీత్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఫ్లై అవే సోలో’ ‘భోపాల్: ఏ ప్రేయర్ ఫర్ రెయిన్’ ‘రిటర్న్ టూ రాజాపూర్’ ‘స్ట్రింగ్స్’ ‘ఎలక్ట్రిక్ మూన్’... ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించాడు. ఇక తెలుగు విషయానికి వస్తే ‘విక్రమార్కుడు’లో బావూజీ పాత్ర ఆయనకు విలన్‌గా ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘కందిరీగ’ ‘నాయక్’ ‘ఆగడు’ ‘సుప్రీం’ ‘శివం’ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘పవర్ ఆఫ్ ఇమాజీనేషన్’ అనేది నటుడికి ముఖ్యం అని నమ్ముతాడు వినీత్. దీనికోసం ఫిక్షన్ చదవాలని కూడా చెబుతాడు. ఈ కసరత్తులే వినీత్ కుమార్‌ను వెండి తెర ‘ఉత్తమ విలన్’గా తీర్చిదిద్దాయి. -
ఎథికల్ హ్యాకింగ్
‘‘భవిష్యత్తు అవసరాలను సరైన సమయంలో అంచనా వేయడం వ్యాపారంలో ఒక విజయ రహస్యం. ఇలాంటి నిపుణత చదువులో కూడా ఉంటుంది. కొంచెం ఆలోచించి వ్యవహరిస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను సంపాదించిపెట్టే చదువులు చదవొచ్చు, ఇండస్ట్రీకి మన అవసరం ఏర్పడేలా చేసుకోవచ్చు...’’ అంటున్నాడు జార్ఖండ్‌కు చెందిన వినీత్ కుమార్. ఒక విజేత హోదాలో ఈ మాటలు చెప్పాడు. ఇంటర్నెట్ వాడకం ఇప్పుడు విస్తృతం అయ్యింది. ఇదే సమయంలో ఎంతో సౌలభ్యంగా ఉన్న ఈ సేవ వల్ల అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. అలాంటి సమస్యల్లో ప్రధానమైనది ‘హ్యాకింగ్’ కంప్యూటర్, ఇంటర్నెట్ టెక్నాలజీల మీద పట్టు సంపాదించి కొంతమంది తమ తెలివితేటలను దుర్వినియోగం చేస్తూ వెబ్ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడం పెద్ద పెద్ద సంస్థలకే భారమవుతోంది. ఈ నేపథ్యంలో హ్యాకర్ల ఎత్తులను తిప్పికొట్టడానికి అవి ఎథికల్ హ్యాకర్లను నియమించుకొంటున్నాయి. దీంతో చాలామంది ఇప్పుడు నెట్వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్స్లో ఉద్యోగావకాశాల గురించి స్టడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిని ఆరేళ్ల కిందటే అంచనా వేసిన వారిలో ఒకడు వినీత్ కుమార్. ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సంపాదించి ప్రస్తుతం జార్ఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నాడు ఈ ఇరవెరైండేళ్ల యువకుడు. పదహారేళ్ల వయసులో సొంతంగా కంపెనీ! పదహారేళ్ల వయసులోనే ఎథికల్ హ్యాకర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు వినీత్‌కుమార్. ఇంటర్నెట్ ఇంకా ఇప్పటిలా విస్తృతం కాని సమయంలోనే ‘నేషనల్యాంటీ హ్యాకింగ్ గ్రూప్’ను స్థాపించాడు. హ్యాకింగ్‌ను నిరోధించడానికి ప్రోగ్రామ్స్‌ను డిజైన్ చేశాడు. గత ఐదారేళ్లలో సైబర్ క్రైమ్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వినీత్‌కు ప్రాధాన్యత పెరిగింది. వినీత్ గురించి తెలుసుకొన్న జార్ఖండ్ పోలీసు శాఖ ‘సైబర్ సెక్యూరిటీస్’కు సహకారం అందించాల్సిందిగా కోరింది. అదే సమయంలో దేశంలో తొలిసారి ఆ రాష్ట్రంలోనే ‘సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెల్’ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ఏర్పరుస్తూనే వినీత్‌కు స్పెషల్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. ఏటీఎం క్లోన్స్, ఫేస్బుక్ ప్రొఫైల్ హ్యాకింగ్, వెబ్‌సైట్స్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ను కాపాడటం...మొదలైన కార్యక్రమాల ద్వారా వినీత్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో పోలీసులకు సహాయపడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు! కేవలం దేశంలోనే గాక దేశం ఆవల కూడా వినీత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. వరల్డ్స్ యంగెస్ట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్‌గా అవార్డు తీసుకొన్నాడు. 2008 సంవత్సరంలో యూఎన్ యూత్ అసెంబ్లీ తరపున గోల్డ్‌మెడల్ గెలుచుకొన్నాడు. తండ్రే స్ఫూర్తి... ‘నా విజయాలకు స్ఫూర్తి మా నాన్న. కలలను సాకారం చేసుకోవడానికి ఆయన ఎంతో సహకారం అందించాడు. ఎథికల్ హ్యాకింగ్ నా జీవితాన్ని మార్చేసింది. దీంట్లో ఎన్నో అవకాశాలున్నాయి. యువత దీనిపై దృష్టిసారించవచ్చు...’అంటున్నాడు వినీత్‌కుమార్. వినీత్ గురించి తెలుసుకొన్న జార్ఖండ్ పోలీసు శాఖ ‘సైబర్ సెక్యూరిటీస్’కు సహకారం అందించాల్సిందిగా కోరింది. అదే సమయంలో దేశంలో తొలిసారి ఆ రాష్ట్రంలోనే ‘సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెల్’ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ఏర్పరుస్తూనే వినీత్‌కు స్పెషల్ ఆఫీసర్ హోదా ఇచ్చారు.