నొప్పి.. నటనా? నిజమా?
ఈ ఫొటోల్లో మహిళ హావభావాలు చూస్తున్నారు కదా. ఇంతకూ ఏ ఫొటోలో ఆమె నిజంగా నొప్పితో బాధపడుతోందో చెప్పగలరా? మొదటి చిత్రం మీ సమాధానమైతే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈమె నిజంగా నొప్పితో బాధపడుతున్న చిత్రం రెండోది. అందుకే.. నొప్పి ఉన్నట్లు నటించేవారిని 85% కచ్చితత్వంతో గుర్తుపట్టే ఓ కంప్యూటర్ వ్యవస్థను టొరాంటో, కాలిఫోర్నియా వర్సిటీల శాస్త్రవేత్తలు రూపొందించారు. నొప్పితో బాధపడుతున్నవారి కనుబొమ్మలు ఎలా ముడుచుకున్నాయి? కళ్లకింద కండరాలు ఎలా బిగుసుకున్నాయి? పెదాలు, దవడలు, బుగ్గల ఆకారాలు ఎలా మారాయి? వంటి అంశాలను పసిగట్టి అది నిజమైన నొప్పా? నటనా? అన్నది ఈ కంప్యూటర్ తేలుస్తుందట.