‘కంప్యూటర్‌’ నగరం!  | Computer City with Chips and Transistors | Sakshi
Sakshi News home page

‘కంప్యూటర్‌’ నగరం!

Published Sun, Mar 18 2018 1:12 AM | Last Updated on Sun, Mar 18 2018 1:12 AM

Computer City with Chips and Transistors - Sakshi

ఈ ఫొటోను ఓ సారి పరిశీలించండి.. ఏముంది కంప్యూటర్‌లోని చిప్స్, ట్రాన్సిస్టర్లే కదా అనుకుంటున్నారా.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ నగరం ఉంటుంది. అవును ఈ ఫొటోలో ఉన్నది మన్‌ హట్టన్‌ నగరం. అదేంటి నిజంగా ఆ నగరం అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారా..? అది నిజమైన నగరం కాదు కానీ.. అమెరికాలోని న్యూయార్క్‌ పక్కనే ఉండే మన్‌హట్టన్‌ను పోలి ఉండేలా నిర్మించారు. కంప్యూటర్‌లోని పనికిరాని వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు ఓ స్కూల్‌ పిల్లాడు.

జింబాబ్వేకు చెందిన జేడ్‌ మెంక్‌ అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ నగరాన్ని రూపొందించేందుకు 3 నెలల సమయం తీసుకున్నాడట. అది కూడా 0.0635:100 నిష్పత్తిలో చిన్న తేడా కూడా లేకుండా మొత్తం నగరాన్ని తీర్చిదిద్డాడు. ఇదంతా కూడా ఆ పిల్లాడి స్కూల్‌ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడి మరీ తయారు చేశాడు. ఇందుకోసం 27 మదర్‌బోర్డులు, 11 సీపీయూలు, 10 సీఆర్‌టీ మానిటర్‌ మదర్‌బోర్డులు, 18 ర్యామ్‌ స్టిక్‌లు, 12 నోకియా ఈ–సిరీస్‌ ఫోన్లు, 4 వాచ్‌లు, 4 ఆడియో కార్డులు, 2 టెలిఫోన్లు ఇలా వాడి పాడేసిన వస్తువుల సాయంతో తయారు చేశాడు. మన్‌హట్టన్‌లోని భవంతులు, ఆకాశహర్మ్యాలు ఇలా ఒక్కటేమిటి అచ్చు ఆ నగరాన్ని పోలినట్లే ఆ పిల్లాడు తయారు చేశాడు. ఇదంతా తయారు చేయడానికి మంచి తెలివితో పాటు ఎంతో ఓపిక ఉండాలి కదా..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement