లండన్: ఇంద్రజాలికులు చేసే మ్యాజిక్ ట్రిక్కులను తొలిసారిగా ఓ కంప్యూటరూ చేసి చూపింది. కృత్రిమ తెలివి(ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్)పై పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ లండన్ పరిశోధకులు ఈ మేరకు ఓ కంప్యూటర్‌తో మ్యాజిక్ జిగ్సా పజిళ్లు, మైండ్ రీడింగ్ కార్డ్ ట్రిక్కులను చేసి చూపించారు.
బాగా ప్రాచుర్యంలో ఉన్న ట్రిక్కులనే కాకుండా కొత్త ట్రిక్కులను కూడా ఈ కంప్యూటర్ చేసిం దని పరిశోధకులు వెల్లడించారు. పెద్ద మొత్తంలో సమాచారాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించడం ద్వారా కంప్యూటర్ ఇంటెలిజెన్స్ ఈ కొత్త ట్రిక్కులను చేసిందని తెలిపారు.